April 3, 2025
SGSTV NEWS
CrimeTechnology

Crime News: ఇద్దరు మైనర్ బాలికల అదృశ్యం

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మచ్చబోల్లారంకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు   అదృశ్యమయ్యారు.తమ కుమార్తెలు కనబడడం లేదని వారి తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. వారిద్దరూ సోషల్‌ మీడియా (ఇన్ స్టా) పరిచయమైన యువకులతో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

Crime News: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మచ్చబోల్లారంకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. తమ కుమార్తెలు రెండు రోజుల నుంచి కనబడడం లేదని బాలికల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. బాలికల పేరెంట్స్ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తెలిసీ తెలియని వయసులో సోషల్‌ మీడియా ప్రభావంతో మైనర్‌ బాలికలు యువకుల పట్ల ఆకర్శితులవుతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ప్రేమ పేరుతో తల్లిదండ్రులను వదిలిపెట్టి యువకులతో వెళ్లిపోతున్నారు. ఆ యువకులు సైతం బాలికలను శారీరకంగా వాడుకొని వదిలేస్తున్నారు. అన్ని పోగొట్టుకున్న అమ్మాయిలు ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు తమ తప్పు తెలుసుకొని ఇంటి ముఖం పడుతున్నారు.

ఆల్వాల్‌ లో అదృశ్యమైన బాలికలు సైతం సోషల్‌ మీడియా వేదిక ఇన్ స్టా గ్రామ్‌లో పరిచయమైన ఇద్దరు యువకులతో ప్రేమలో పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ యువకులు బాలికలిద్దరికి మాయమాటలు చెప్పి ఓయో రూమ్‌కు  తీసుకువెళ్లి వారితో గడిపినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఇద్దరు యువకుల్లో ఒకరు ఈసీఐఎల్, మరొకరు దమ్మాయి గూడకు చెందిన వారిగా పోలీసులు తేల్చారు. వారిద్దరిపై కిడ్నాప్, పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


ఇదిలా ఉండగా 17 ఏళ్ల బాలిక 45 ఏళ్ల వయస్సున్న వ్యక్తితో వెళ్లిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 11న హైదరాబాద్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది.  దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కొద్ది రోజులకు పోలీసులు వెతికి పట్టుకున్నారు. కాగా 45 ఏండ్ల వ్యక్తితో వెళ్లిపోయినట్లు తేలింది. బాలికను భరోసా సెంటర్‌కు తరలించి విచారించడంతో అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ అని తేలింది. దీంతో నిందితుడిపై పోక్సో  కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం బాలికకు కౌన్సెలింగ్‌ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణకు గురవుతున్న బాలికలు ప్రేమ మాయలో పడి తమ జీవితాల్ని నాశనం చేసుకోవడమే కాకుండా తల్లిదండ్రులకు తీరని శోకన్ని మిగుల్చుతున్నారు.

Also read

Related posts

Share via