నారాయణపేట రూరల్: మూడు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. కాబోయే వధువు ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో పరువు పోయిందన్న మనస్తాపంతో పెళ్లి కొడుకు తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలంగాణలోని నారాయణపేటలో చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన కాంజి గోవిందరావు కుమారుడు అభిషేకు జ్ఞాని విజయ్కుమార్ కూతురు శ్వేతతో పెళ్లి కుదిరింది. నాలుగు నెలల క్రితం ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని సైతం ఘనంగా నిర్వహించారు.
ఈ నెల 9వ తేదీన పెళ్లి ముహూర్తం నిశ్చయించి పెళ్లిపత్రికలు కూడా పంచారు. కాగా.. ఆదివారం ఉదయం పెళ్లి కూతురు శ్వేత తన ప్రియుడు వెంకటేశ్తో వెళ్లిపోయింది. దీంతో పెళ్లి ఆగిపోయింది. అయితే మంగళవారం తన కుమారుడిని పెళ్లి కొడుకుని చేయాల్సి ఉండగా ఇలా పెళ్లి ఆగిపోవడం భరించలేక.. మనస్తాపంతో తండ్రి గోవిందరావు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కూతురి ప్రేమ వ్యవహారం తెలిసినా విజయ్కుమార్ దాచిపెట్టి.. పెళ్లికి సిద్ధమై పరువు తీశారని, అందుకే గోవిందరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడని వరుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన తమ్ముడి చావుకు కారణమైన వారిపై చర్య తీసుకోవాలని మృతుడి సోదరుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025