*నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి,ప్రజల మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతా జనసేన,తెలుగుదేశం,బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ మరియు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు శ్రీ బూరుగుపల్లి శేషారావు….

తూర్పుగోదావరి జిల్లా, నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు పట్టణం 5వ, వార్డు పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నుండి మెయిన్ బజార్ లో ఈరోజు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కందుల దుర్గేష్ గారు ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు… ప్రచారంలో ఆడపడుచులను,అన్నదమ్ములను,అవ్వ,
తాతలను ఆప్యాయంగా పలకరిస్తూ ఉమ్మడి పార్టీల యొక్క మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ,ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కందుల దుర్గేష్ గారికి గాజు గ్లాసు గుర్తుపై, పార్లమెంటు అభ్యర్థి అయిన దగ్గుపాటి పురందేశ్వరి గారికి కమలం గుర్తుపై ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు…

*ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ తెలుగుదేశం, జనసేన మరియు భారతీయ జనతా పార్టీల అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు గారు, రంగా రమేష్ గారు, నీలం రామారావు గారు, కనుమూరి సీతారామయ్య గారు మరియు తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల నాయకులు,కార్యకర్తలు,వార్డు ప్రజలు పాల్గొన్నారు….


Also read
- ఉగాది రోజు ఇంటికి మామిడాకు తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?
- ఈ ఉగాది ప్రత్యేకత ఏమిటో తెలుసా? షడ్రుచల పచ్చడి రహస్యం!
- నాలుగు గ్రహాల మార్పు.. ఈ రాశుల జీవితంలో కొత్త వెలుగులు!
- నేటి జాతకములు…17 మార్చి, 2026
- ఎంత కష్టమొచ్చిందో.. కన్న బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి





