నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని ఓ గ్రామంలో ఈ నెల 12న బాలికపై జరిగిన అత్యాచారయత్నం కేసులో నిందితుడి మృతి విషయం కొత్త మలుపు తిరిగింది.వివరాలు లోకి వెళితే
రెంజల్, : నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని ఓ గ్రామంలో ఈ నెల 12న బాలికపై జరిగిన అత్యాచారయత్నం కేసులో నిందితుడి మృతి విషయం కొత్త మలుపు తిరిగింది. అతడు మృతి చెందింది స్థానికుల దాడి వల్ల కాదని.. ఠాణాలోనే ఉరి వేసుకుని చనిపోయాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్థానిక పోలీసు అధికారులెవరూ ధ్రువీకరించడంలేదు. ఈ ఘటనకు సంబంధించి ప్రసాద్ అనే కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. ఎస్సై సాయన్నకు, లింబాద్రి, లక్ష్మణ్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లకు ఛార్జి మెమోలు జారీ చేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మానసిక స్థితి సరిగా లేని పదేళ్ల బాలికపై రెడ్యా (55) అత్యాచారయత్నం చేశాడంటూ.. ఆమె బంధువులు, స్థానికులు ఈ నెల 12వ తేదీ రాత్రి నిందితుడిపై దాడి చేశారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి.. అతడిని జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అదే రోజు అర్ధరాత్రి ఠాణాకు తీసుకొచ్చి ఓ గదిలో ఉంచారు. తెల్లవారుజామున రెడ్యాను మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అస్వస్థతకు గురైతే తీసుకొచ్చామని.. కొంతసేపటికే అతడు మృతి చెందార పోలీసులు ప్రకటించారు. గ్రామస్థుల దాడిలో గాయపడటం వల్లే అతడు మృతి చెందినట్లు అందరూ భావించారు. కానీ నిందితుడు ఠాణాలోనే తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారం. దీనిపై మృతుడి బంధువులు కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మెదక్ జిల్లా తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి విచారణ చేశారు. నిందితుడు అవమాన భారంతోనే ఉరి వేసుకున్నాడని ఇక్కడి పోలీసులు విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు నిందితుడిపై దాడి ఘటనలో ఏడుగురిని మంగళవారం రాత్రి అరెస్టు చేసినట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.
Also Read
- Hyderabad: నడుచుకుంటూ వెళ్తున్న యువతి.. వెనకే వచ్చి పట్టుకున్న పట్టుకున్న వ్యక్తి.. కట్ చేస్తే..
- Software employee suicide: కాకినాడలో మరో బెట్టింగ్ బాధితుడు బలి.. తల, మొండెం వేరై
- AP Crime: గుడివాడలో విషాదం.. పశువును తప్పించబోయి బోల్తా పడ్డ ఆటో.. మొత్తం 11 మంది..!
- DNA test: దివ్యాంగ సోదరిపై అత్యాచారం.. నాలుగేళ్లకు ‘డీఎన్ఏ’ పరీక్షలో దొరికిపోయి!
- ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య