April 11, 2025
SGSTV NEWS
CrimeUttar Pradesh

ఆ నేత నన్ను రేప్ చేసి.. వీడియో తీసి బ్లాక్మెయిల్ చేశాడు: యువతి ఫిర్యాదు



ఓ స్థానిక రాజకీయ నాయకుడు తనపై అఘాయిత్యానికి పాల్పడి ఆ వీడియోతో బ్లాక్మెయిల్ చేసి వేధింపులకు గురిచేస్తున్నట్లు ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన యూపీలోని మవూ జిల్లాలో వెలుగుచూసింది.

మవూ: మహిళల పట్ల జరుగుతోన్న దారుణాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నా.. ప్రభుత్వాలు కఠిన చట్టాలు చేస్తున్నా వారిపై దురాగతాలు మాత్రం ఆగడంలేదు. యూపీలోని మవూ జిల్లాలో 18 ఏళ్ల యువతిపై దాదాపు ఏడాది కాలంగా జరుగుతోన్న దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. సమాజ్వాదీ పార్టీకి చెందిన స్థానిక నేత తనపై ఏడాది కాలంగా అత్యాచారానికి ఒడిగడుతున్నట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మవూలోని కొత్వాలినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. నిందితుడిని సమాజ్వాదీ పార్టీ స్థానిక నేత, న్యాయవాది అయిన వీరేంద్ర పాల్గా గుర్తించారు. బాధిత యువతి అతడికి న్యాయపరమైన అంశాల్లో సహకరిస్తుండేదని పోలీసులు తెలిపారు.

పోలీసులు ఎఫ్ఎఆర్ పేర్కొన్న వివరాల ప్రకారం.. “యువతికి మత్తుమందు కలిపిన కూల్డ్రింక్ ఇచ్చిన పాల్.. తన కారులో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ దుశ్చర్యను వీడియోతీసి ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ ఏడాది కాలంగా ఈ దుర్మార్గాన్ని కొనసాగిస్తున్నాడు. ఆమె జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా రూ.4లక్షలు దోచుకున్నాడని యువతి ఆరోపించింది. చివరిసారిగా అతడిని జులై 16, 17 తేదీల్లో ఓ హోటల్లో కలుసుకున్నానని.. అక్కడ కూడా తన? అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు వాపోయింది.సెప్టెంబర్ 6న తన వాహనాన్ని తిరిగి తీసుకురావడానికి వెళ్లగా తనను కొట్టి దుర్భాషలాడాడని, చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడని మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన పోలీసులు అతడిపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు.

తాజా వార్తలు చదవండి

Related posts

Share via