పెళ్లిచేసిన పంపిన బిడ్డ చనిపోవడంతో పెళ్లి సమయంలో తాము ఇచ్చిన కట్నం తిరిగి ఇవ్వాలని బిడ్డ అత్తవారింటి వద్ద ఆందోళనకు దిగిన ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.
TG News: పెళ్లిచేసిన పంపిన బిడ్డ చనిపోవడంతో పెళ్లి సమయంలో తాము ఇచ్చిన కట్నం తిరిగి ఇవ్వాలని బిడ్డ అత్తవారింటి వద్ద ఆందోళనకు దిగిన ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రామకృష్ణాపూర్‌లోని భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన సింగరేణి కార్మికుడు ముద్దసాని సురేష్‌కు అదే పట్టణానికి చెందిన లావణ్యతో 2021లో పెళ్లి జరిగింది. అయితే పెళ్లయిన కొన్నాళ్లాకే ఇద్దరిమధ్య విబేధాలు చోటు చేసుకున్నాయి. దీంతో లావణ్య భర్త దగ్గర నుంచి వచ్చేసి తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఇద్దరిని కలపడానికి పలు మార్లు ప్రయత్నించినా అది సాధ్యపడలేదు
ఇదిలా ఉండగా ఈ నెల 16న సింగరేణి కార్మికుడైన తన తండ్రి గాండ్ల సత్యంతో కలిసి లావణ్య ద్విచక్రవాహనం పై వెళ్తుండగా పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట స్టేజీ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తండ్రి సత్యం అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన లావణ్యను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి లావణ్య మృతి చెందింది. అయితే పెళ్లినాటి నుంచి లావణ్య పుట్టింట్లోనే ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు మృతదేహాన్ని భర్త సురేష్ ఇంటికి తీసుకొచ్చారు
సురేష్, లావణ్యల మధ్య వివాదాల నేపథ్యంలో పోస్టుమార్టం అనంతరం లావణ్య మృతదేహాన్ని అంబులెన్స్‌లో భర్త సురేష్ ఇంటికి తీసుకొచ్చారు. పెళ్లి నాటి నుంచి లావణ్య తమ వద్దే ఉంటున్నందున పెళ్లి సమయంలో తాము ఇచ్చిన వరకట్నం రూ.50 లక్షలు తిరిగి ఇవ్వాలని ఆందోళనకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళన తీవ్రం కాకుండా నిలువరించేందుకు మృతదేహాన్ని ఆర్కేపీ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కట్నం డబ్బులు తిరిగి ఇవ్వకుంటే అంత్యక్రియలు నిర్వహించబోమని బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఆందోళనతో రెండు రోజులుగా మృతదేహం అంబులెన్స్‌లోనే ఉంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, ఆర్కేపీ, మందమర్రి ఎస్సైలు లావణ్య కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని వారి స్వగ్రామమైన పెద్దపల్లి జిల్లా ఓదెలకు పంపించివేశారు. కాగా పెళ్లి సమయంలో ఇచ్చిన రూ.50 లక్షలకు బదులు రూ.20 లక్షలు తిరిగి ఇవ్వడానికి ఒప్పందం కుదరడంతో ఆందోళన విరమించినట్లు తెలిసింది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025