సిరిసిల్లలో దారుణం జరిగింది. చందుర్తి గ్రామానికి చెందిన బొల్లు మల్లవ్వ(60)ను అదే గ్రామానికి చెందిన మనోజ్ పెద్దమ్మ గుడి ముందు వేట కొడవలితో నరికి చంపాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. ఆమె తల, చేతులు నరికేసినట్లు నేరం అంగీకరించి లొంగిపోయాడు.
TG Crime: సిరిసిల్లలో దారుణం జరిగింది. చందుర్తి గ్రామానికి చెందిన బొల్లు మల్లవ్వ(60)ను అదే గ్రామానికి చెందిన మనోజ్ అనే యువకుడు పెద్దమ్మ గుడి ముందు వేట కొడవలితో నరికి చంపాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆమె తల, చేతులు నరికేసినట్లు నేరం అంగీకరించి లొంగిపోయాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గతంలోనూ మనోజ్‌పై మర్డర్ కేసుఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. న్యాల్‌కల్ మండలం రుక్మాపూర్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. రాణెమ్మ(48) అనే ఒంటరి మహిళను దుండగులు డబ్బు కోసం దారుణంగా చంపేశారు. ఆమె ఇంట్లోకి చొరబడి బంగారం, నగదు తీసుకుని ఆపై ఆమెను సీసాతో పొడిచి దారుణంగా హత్య చేశారు. వెంటనే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
ఆదివారం ఉదయం హైదరాబాద్ సమీపంలోని ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆనందంగా స్వగ్రామానికి వెళ్లే ప్రయాణం ఒక్కసారిగా విషాదంగా మారింది. అనకాపల్లి జిల్లా దొండపూడి గ్రామానికి చెందిన మట్ట వెంకటేశ్,శ్వేత (33) దంపతులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వెంకటేశ్ వేసవి సెలవుల సందర్భంగా తన భార్య శ్వేత, ఇద్దరు పిల్లలను స్వగ్రామానికి పంపించాలనుకున్నారు. కానీ ఆ తల్లి కన్నపిల్లల కళ్ల ముందే రైలు ప్రమాదంలో మృతి చెందింది.
Also read
- సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు..? ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకోండి
- గరుడపురాణం రహస్యాలు.. అంతిమ సంస్కారాలు కూతుళ్లు చేస్తే ఏమవుతుంది..?
- నేటి జాతకములు…16 మార్చి, 2026
- Hyderabad: జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. కట్ చేస్తే, ఆశ దోశ అప్పడం వడ..
- ప్రేమ పేరుతో ఎంతకు తెగించావురా.. అమ్మాయిని రూమ్‌కు తీసుకెళ్లి..





