February 23, 2025
SGSTV NEWS
CrimeTelangana

TG Crime: మొదటి భర్త చనిపోయి రెండో పెళ్లి చేసుకుంటే.. పాపం దారుణం!


భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఓల్డ్‌ అల్వాల్‌లో జరిగింది. శిరీష(28)కు 2019లో సరూర్‌ నగర్‌కు చెందిన పవన్‌తోమొదటి పెళ్లయింది. భర్త చనిపోవడంతో మరోవ్యక్తితో పెళ్లి చేయగా అతడు వేధింపులకు గురిచేయడంతో శిరీష ఆత్మహత్యకు పాల్పడింది.

TG Crime: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ప్రశ్నించినందుకు భార్యను ఒక హోంగార్డు హత్య చేశాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని 5 ఇన్‌క్లైవ్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రామగుండం కమిషనరేట్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న ఆవుల గట్టయ్య ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇంటి అవసరాలకు డబ్బు కూడా ఇవ్వడం లేదని భార్య రామలక్ష్మి(36) భర్తను నిలదీసింది. దీంతో రామలక్ష్మి తలను గొడకేసి కొట్టాడు. తీవ్రగాయాలు అవడంతో స్థానికంగా చికిత్స చేయించి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రామలక్ష్మి మృతి చెందింది. రామలక్ష్మి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గట్టయ్యపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. తర్వాత రిమాండ్‌కు తరలించారు.

భర్త వేధింపులు తాళలేక..
ఇక మరో ఘటనలో  భర్త వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌ ఓల్డ్‌ అల్వాల్‌లో జరిగింది. శిరీష(28)కు 2019లో సరూర్‌ నగర్‌కు చెందిన పవన్‌తో పెళ్లయింది. అయితే అనారోగ్యంతో పవన్‌ కుమార్‌ 2020లో మృతి చెందాడు. ఆ తర్వాత వారాసిగూడకు చెందిన యాకుబ్‌రెడ్డితో ఆమెకు రెండో పెళ్లి చేశారు. మద్యానికి బానిసై యాకుబ్‌ వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులకు చెప్పి శిరీష బాధపడింది. ఆ తర్వాత తీవ్ర మనస్తాపం చెంది అత్తింట్లో ఉరేసుకుంది. తల్లి మాధవి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు ప్రేమించిన యువతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌ ప్రగతినగర్‌లో జరిగింది. కర్నూలు జిల్లా సుంకేశులకు చెందిన మల్లికార్జున్ (26) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చి కేబుల్‌ వైర్‌తో ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీఆస్పత్రికి తరలించారు.

Also read

Related posts

Share via