SGSTV NEWS
CrimeSpiritual

Temple: గుడి లోపలికి వెళ్లేటప్పుడు చెప్పులు ఎందుకు తీసేస్తారో తెలుసా?



గుడి.. మనసుకు, మనిషికి ప్రశాంతతనిచ్చే పవిత్రమైన ప్రదేశం. చాలామంది వారానికి 2, 3 సార్లు గుడికి వెళ్తుంటారు. గుడికి వెళ్లిన ప్రతిసారీ లోపలికి వెళ్లే ముందు చెప్పులు తీసేసి వెళ్తుంటారు. అసలు చెప్పులు ఎందుకు విప్పేస్తారు? దాని వెనకు ఉన్న కారణమెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుడికి వెళ్లడం ఒక ప్రత్యేక అనుభూతినిస్తుంది. దైవదర్శనం చేసుకొని కాసేపు ఆ పవిత్రమైన స్థలంలో కూర్చుంటే ఎక్కడ లేని ప్రశాంతత మన సొంతమవుతుంది. చాలామంది వారానికి రెండు, మూడు సార్లు, కుదిరితే రోజుకోసారి కూడా దేవాలయాలకు వెళ్తుంటారు. అయితే వెళ్లిన ప్రతిసారీ చెప్పులను బయట వదిలేసే వెళ్తారు. ఇంతకీ చెప్పులు ఎందుకు బయట విప్పుతారో మీకు తెలుసా? దాని వెనక ఉన్న సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం


చెప్పులను ఎందుకు బయట వదిలేస్తారు?

👉   గుడి పవిత్ర స్థలం.

ఇక్కడ పరిశుభ్రత, పవిత్రత చాలా ముఖ్యం. గుడిని శుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత కూడా. పాదరక్షలు శుభ్రమైన, అశుభ్రమైన ప్రదేశాలతో సంబంధం కలిగి ఉంటాయి. గుడిని దేవుని పవిత్ర నివాసంగా భావిస్తారు. కాబట్టి దాని పవిత్రతను కాపాడటం చాలా అవసరం. అందుకే చెప్పులను గుడి ముందే విప్పేసి వెళ్తుంటారు.

👉  ఆధ్యాత్మిక భావనతో..

భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఎక్కడా చెప్పులను గుడిలోకి వేసుకెళ్లరు. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు. దీనికి ఆధ్యాత్మిక, ఆరోగ్యకరమైన, సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా ఉంది.

👉  దేవుని ముందు అందరూ సమానమే!

గుడికి వెళ్ళే ముందు చెప్పులు తీయడం అంటే అహంకారాన్ని వదులుకోవడం, ప్రపంచంలోని తేడాలను, మనుషుల మధ్య భేదాలను వదులుకోవడానికి గుర్తుగా భావిస్తారు. దేవుని ముందు అందరూ సమానమే అని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ.

Related posts

Share this