SGSTV NEWS
TelanganaViral

Watch: నాగులచవితి నాడు అద్భుతం..! శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి..


మహబూబాబాద్ జిల్లాలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. నాగులచవితి పర్వదినం రోజున భక్తులకు నాగన్న దర్శనం కనువిందు చేసింది. జిల్లాలోని బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంలోని శివాలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. అంతేకాదు..శివలింగం పైన పడగవిప్పిన నాగుపాము భక్తుల్ని ఆశీర్వదించినట్టుగా కనిపించింది. నాగులచవితి రోజున గర్భగుడిలో నాగుపాము కనిపించటం అరుదైన ఘట్టంగా భావించిన భక్తులు పరవశించి పోయారు. నాగుపాముకు దండాలు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చిన భక్తులు పుట్టలో పాలు పోసి, పసుపు, కుంకుమలతో అర్చనలు అభిషేకాలు చేశారు.

Also read

Related posts