February 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

వామ్మో ఎంత మోసం.. నకిలీ మహిళా ఐఏఎస్ గుట్టురట్టు

తన భార్య భాగ్యరేఖ బాలల హక్కుల కమిషన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్నట్లు పరిచయం చేశాడు. ఈ పేరుతో తయారు చేసిన ఓ నకిలీ గుర్తింపు కార్డు కూడా చూపించడంతో మధు నమ్మాడు. పైనాపిల్‌ కాలనీలో టిడ్కో ఇళ్లు ఇప్పిస్తానని పలు దఫాలుగా రూ.80వేలు తీసుకున్నారు. అలాగే రమ అనసూయ అనే మహిళతో జీవీఎంసీˆ కమిషనర్‌గా పరిచయం చేసుకుని రూ.లక్ష వరకు తీసుకున్నారు. అయితే ఎలాంటి ఇళ్లు ఇవ్వకపోవడంతో బాధితులు నిలదీశారు. దీంతో వారిపై దొంగతనం కేసు పెడతానని భాగ్యరేఖ బెదిరింపులకు దిగింది. బాధితులు భాగ్యరేఖ, ఆమె భర్త చంద్రశేఖర్‌లపై ఈనెల 22న ఎంవీపీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణలో పోలీసులు భాగ్యరేఖని నకిలీ ఐ.ఎ.ఎస్‌.గా గుర్తించారు. ఫిర్యాదు అందిందని తెలియగానే వీరిద్దరూ పరారయ్యారు. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒంగోలు వద్ద అదుపులోకి తీసుకుని విశాఖ తీసుకువచ్చారు. నిందితురాలు భాగ్యరేఖ గతంలో ఇలాగే కంచరపాలెం పరిధిలో కూడా పలువురిని మోసం చేసినట్లు కేసులు నమోదయ్యాయి.

Also read

Related posts

Share via