నిన్న మొన్నటి వరకూ పాములు, చిరుతలు, ఎలుగుబంట్లు జనావాసాల్లోకి వచ్చి ప్రజల్ని భయాందోళనకు గురి చేశాయి. తాజాగా ఈ లిస్ట్‌లోకి మొసళ్లు కూడా చేరాయి. నదుల్లో, చెరువుల్లో ఉండాల్సిన మొసళ్లు రోడ్డెక్కుతున్నాయి. జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఆహారం కోసం వన్యప్రాణులు ఇలా ప్రజల్లోకి రావడంతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తాజాగా పల్నాడు సిల్లాలో ఓ డంపింగ్‌యార్డ్‌లో మొసళ్లు కలకలం రేపాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో డంపింగ్‌యార్డ్‌లో మొసళ్లు సంచరిస్తుండగా గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. కొందరు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది మొసళ్లను బంధించి పులిచింతల ప్రాజెక్ట్ సమీపంలోని కృష్టానదిలో వదిలారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025