ఈ రాకెట్‌కు సూత్రధారిగా భావిస్తున్న 22 ఏళ్ల యువకుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 12 చోట్ల జరిపిన దాడుల్లో 350కి పైగా మొక్కలున్న రెండు గంజాయి పొలాలు, నగదు, తుపాకులు, కత్తులు, ఖరీదైన గడియారాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఒక రెస్టారెంట్‌లో ప్రత్యేకమైన పిజ్జాకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. అది ఎంతలా అంటే..ఫుడ్ సేఫ్టీ అధికారులను సైతం ఒక్కసారిగా షాక్ అయ్యేలా చేసింది. ఉన్నట్టుండి ఇంత విస్తృతంగా అమ్ముడవుతున్న ఆ పిజ్జా కథేంటో తెలుసుకోవాలని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనుమానంతో ఆరా తీయగా అసలు విషయం బట్టబయలైంది. దీంతో రెస్టారెంట్‌పై చర్యలు తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో అరెస్ట్‌లు కూడా జరిగాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..
జర్మన్ పోలీసులు ఇటీవల ఓ రెస్టారెంట్‌పై దాడి చేశారు. అక్కడ కస్టమర్‌లు ఎగబడి కొంటున్న పిజ్జేరియా మెనూలోని ఐటెమ్ నంబర్ 40 అసాధారణంగా అమ్ముడవుతున్న విషయంపై లోతైన విచారణ చేపట్టారు. దాంతో నంబర్ 40గా పిలిచే ఆ పిజ్జా కొకైన్‌తో తయారు చేస్తున్నట్టుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్దారించారు. రెస్టారెంట్ మెనూలో ‘నంబర్ 40’ పిజ్జా అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ రెస్టారెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న పిజ్జాలో కొకైన్‌ను కలుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దాంతో వెంటనే పిజ్జా హాట్ మేనేజర్‌ను అరెస్టు చేశారు.
అయితే, పోలీసులు రావటం గమనించిన 36 ఏళ్ల పిజ్జా మేనేజర్ కొకైన్ బ్యాగ్‌ను కిటికీలోంచి విసిరేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆ బ్యాగ్‌ను క్రింద నిలబడి ఉన్న పోలీసు అధికారులు పట్టుకున్నారు. అతని అపార్ట్‌మెంట్ నుంచి కిలోన్నర కొకైన్, 400 గ్రాముల గంజాయి, 2,90,378 డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత విడుదలైన అతడు మళ్లీ డ్రగ్స్ వ్యాపారంలోనూ అతడు భాగస్వామిగా ఉన్నాడని సమాచారం.
ఈ మొలకలు ప్రతిరోజు ఉదయాన్నే గుప్పెడు తినండి చాలు.. రోగాలు పరార్!
దీని తర్వాత, ఈ రాకెట్‌కు సూత్రధారిగా భావిస్తున్న 22 ఏళ్ల యువకుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 12 చోట్ల జరిపిన దాడుల్లో 350కి పైగా మొక్కలున్న రెండు గంజాయి పొలాలు, నగదు, తుపాకులు, కత్తులు, ఖరీదైన గడియారాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, డ్రగ్స్ పిజ్జా ధర ఎంతన్నది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. జర్మనీ కఠినమైన గోప్యతా చట్టాల కారణంగా, పోలీసులు రెస్టారెంట్ పేరు, చిరునామా, యజమాని పేరును కూడా విడుదల చేయలేదు.
Also read
- Margashira Masam: పోలి పాడ్యమితో మార్గశిర మాసం ప్రారంభం.. గీతా జయంతి సహా విశిష్ట పండగలు ఏమిటంటే..
- నేటి జాతకములు 4 డిసెంబర్, 2024
- AP News: మాయ మాటలు చెప్పి బాలికను ట్రాప్ చేసిన మ్యాథ్స్ టీచర్.. కోర్టు సంచలన తీర్పు
- డోలి లో గర్భిణీని ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు..
- భార్యాభర్తల డ్రగ్స్ దందా!