పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో నాటు కోళ్ల దొంగలు ఎక్కువయ్యారు. ఒకటి కాదు రెండు కాదు.. 30 కోళ్లను ఎత్తుకెళ్లారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సుల్తానాబాద్ కు చెందిన ఆరేల్లి చంద్రయ్య అనే వ్యక్తి తన పొలం వద్ద ఓ షెడ్డులో 100 నాటు కోళ్లను పెంపకం చేపట్టాడు. అయితే రాత్రి, పగలు తేడా లేకుండా కొంతమంది దొంగలు నాటు కోళ్లను చోరీ చేస్తున్నారు. అపహరించిన కోళ్లను అమ్ముకుని సొమ్ము చేసుకోగా, మరి కొన్ని నాటుకోళ్లతో పార్టీ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 30 కోళ్లను ఎత్తుకెళ్లారని బాధితుడు చంద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే నాటు కోళ్లను చోరీ చేస్తున్న సమయంలో దొరికినట్టే దొరికి, పారిపోయారని, ఒక్కో నాటుకోడి 2000 రూపాయల పైనే ఉంటుందని, తన కోళ్లను చోరీ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు చంద్రయ్య పోలీసులను వేడుకుంటున్నాడు.
Also read
- Telangana: హైదరాబాద్లో కాల్పుల కలకలం.. గన్తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?
Please subscribe





