తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాలో ఉన్నఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్‌పోర్టును పాస్‌పోర్టు అథారిటీ రద్దు చేసింది. నిందితుల పాస్‌పోర్టు రద్దు నివేదికను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించారు నగర పోలీసులు.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులుగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌రావుకు ఊహించని షాకిచ్చింది ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం. ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు పాస్‌పోర్టులను రద్దుచేసింది. దాంతో, అమెరికాలో తలదాచుకున్న వీళ్లిద్దరూ ఇప్పుడు బయటికిరాక తప్పదని భావిస్తున్నారు తెలంగాణ పోలీసులు.
ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు పాస్‌పోర్టుల రద్దు అంశాన్ని అమెరికాకు తెలియజేయనున్నారు హైదరాబాద్ పోలీసులు. పాస్‌పోర్టుల రద్దు విషయం అమెరికాకు చేరితే వాళ్లిద్దరినీ బలవంతంగా దేశం నుంచి పంపించే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు నివేదించారు హైదరాబాద్ పోలీసులు.
IB మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావుపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయ్. ఇప్పుడు రెడ్‌కార్నర్ నోటీస్ ఇచ్చేందుకు ముమ్మర ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ కాప్స్ పంపిన నివేదికను ఇప్పటికే ఇంటర్ పోల్‌కి పంపింది సీబీఐ. దాంతో, అతి త్వరలోనే పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయిన వెంటనే వీరద్దరూ అమెరికాకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
Also read
- హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండు సార్లు ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
- ఆర్ధిక ఇబ్బందులా, జీవితంలో సమస్యలా హనుమాన్ జయంతి రోజున ఇంట్లో ఇలా పూజ చేయండి..
- హనుమంతుడికి ఇష్టమైన ఈ నైవేద్యం పెడితే మీ కోరికలు నెరవేరుతాయి..!
- సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం
- Nellore: నెల్లూరు జిల్లాలో భర్త, అత్తమామల పైశాచికం.. కోడలిని వివస్త్రను చేసి హత్య!