April 4, 2025
SGSTV NEWS
CrimeTelangana

Telangana: అప్పు తీసుకున్నోడు మంచిగానే ఉన్నాడు..అప్పుడు ఇచ్చిన్నోడు మంచిగానే ఉన్నాడు.. కానీ మధ్యలో..

ప్రభుత్వ ఉపాధ్యాయుడి వడ్డీ కక్కుర్తి చిరు వ్యాపారి ప్రాణాలు బలి తీసుకొంది. అప్పు తీసుకున్నోడు పారిపోయాడు.. మద్యవర్తి బలయ్యాడు..ఈ ఘటన హనుమకొండలోని గోకుల్ నగర్ ప్రాంతంలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదవాల్సిందే..


హనుమకొండలో వడ్డీ వ్యాపారి అవతారమెత్తిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాక్షసంగా ప్రవర్తించాడు.. అధిక వడ్డీ కోసం కక్కుర్తిపడి ఓ అమాయకుడి ఆత్మహత్యకు కారకుడు అయ్యాడు.. ఆ వడ్డీ వ్యాపారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న చిరు వ్యాపారి డెడ్ బాడీతో కుటుంబసభ్యులు అతని ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన హనుమకొండలోని గోకుల్ నగర్ ప్రాంతంలో జరిగింది. విష్ణు అనే వ్యక్తి రమేష్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడి వద్ద రూ.3లక్షలు వడ్డీకి తీసుకున్నాడు. అతనికి ఇదే ప్రాంతానికి చెందిన రాంబాబు అనే చిరు వ్యాపారి మద్యవర్తిగా ఉన్నాడు.


వడ్డీకి తీసుకున్న విష్ణు కొద్ది రోజుల క్రితం వ్యాపారంలో నష్టపోయి పారిపోయాడు. ఈ క్రమంలో మద్యవర్తిగా ఉన్న రాంబాబు ఆ డబ్బు వడ్డీ చెల్లించాలని ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమేష్ వేధింపులకు గురిచేశాడు. అసలు రూ.3 లక్షలు, వడ్డీతో కలుపుకొని రూ.20 లక్షల వరకు అయిందని ఆ డబ్బంతా చెల్లించాలని వేదింపులకు గురి చేశాడని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మద్యవర్తిగా ఉన్నందుకు కొంతడబ్బు చెల్లించిన రాంబాబు అతని వేధింపులు భరించలేక తీవ్ర మనోవేదన చెందాడు. ఆదివారం ఉదయం పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతుడి బందువులు రోడ్డెక్కారు. ప్రస్తుతం అప్పు ఇచ్చిన ఉపాధ్యాయుడు రమేష్, అప్పు తీసుకున్న విష్ణు పరారీలో ఉన్నారు. మృతుడికి ఇద్దరు కూతుళ్ళు.. స్థానికులు వారికి అండగా నిలిచారు… ఆ వడ్డీ రాక్షసుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డెడ్ బాడీ తో ఆందోళన చేస్తున్నారు.. పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు

Also read

Related posts

Share via