SGSTV NEWS
Andhra PradeshCrime

ఇక ఓపిక లేదమ్మా.. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోను ఎమ్మెల్యే భార్యకు పంపిన మహిళ..


శ్రీకాళహస్తిలో సంఘమిత్రగా పనిచేస్తున్న రేవతి అనే మహిళ తన ఉద్యోగం నుంచి తొలగించడంతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఆత్మహత్యాయత్నానికి ముందు ఆమె ఎమ్మెల్యే భార్యకు సెల్ఫీ వీడియో పంపి తన బాధను వెల్లడించింది. రాజకీయ ఒత్తిళ్ల వల్ల తన ఉద్యోగం పోయిందని ఆరోపించింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన రాజకీయ చర్చకు దారితీసింది.


శ్రీకాళహస్తిలో సంఘమిత్ర ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. 16 ఏళ్లుగా సంఘమిత్రగా పనిచేస్తున్న తనను ఉద్యోగంలో నుంచి తొలగించడంతో మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ఈ సందర్భంగా సెల్ఫీ వీడియోను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌ భార్యకు పంపించడం కలకలం రేపింది.. వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో సంఘమిత్రగా పనిచేస్తున్న రేవతి అనే మహిళ.. తనను ఉద్యోగం నుంచి తొలగించడంతో ఆత్మహత్యకు యత్నించింది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకుని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌ భార్య రిషితరెడ్డికి పంపింది.


తొట్టంబేడు మండలం తాటిపర్తి గ్రామంలో 16 ఏళ్లుగా సంఘమిత్రగా పనిచేస్తుంది రేవతి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ నేతలు తనను వేధిస్తున్నారని వాపోయింది బాధితురాలు. కక్షతో తనను సంఘమిత్ర ఉద్యోగం నుంచి తొలగించారని సెల్ఫీ వీడియోలో రిషితకు మొరపెట్టుకుంది. తనను సంఘమిత్రగా కొనసాగించాలని వేడుకుంది.

తనకు ఉద్యోగం పోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. రేవతి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై రాజకీయాలు సైతం మొదలయ్యాయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంఘమిత్ర ఉద్యోగం చేసేవారిపై వేధింపులు పెరిగాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో చిన్న ఉద్యోగం చేసుకునేవారిని టార్గెట్ చేయడం సరికాదంటూ వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.

Also read

Related posts

Share this