April 4, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

ఆస్తి కోసం కట్టుకున్న భర్త, అత్తను బయటకు గెంటిన కోడలు..!

కడప జిల్లాలోని బద్వేల్ లో వెలుగుచూసింది. ఆస్తి కోసం కట్టుకున్న భర్తను అతని తల్లిని బయటికి గెంటిందీ ఓ ఇల్లాలు.


మానవత్వాలు విలువలు మంట కలిసిపోయి దబ్బే ప్రధానంగా భావిస్తున్నారు. ఈ రోజుల్లో అంతా డబ్బుంటే చాలు ఎవరితోడు అవసరం లేదనుకుంటున్నారు. అది కట్టుకున్న భర్త అయినా కన్న పిల్లలైనా, ఎవరైనా సరే మానవ విలువలకు చోటు లేకుండా డబ్బుకి ప్రాధాన్యత ఇస్తూ బతుకుతున్నారు. అలాంటి సంఘటన ఇప్పుడు కడప జిల్లాలోని బద్వేల్ లో వెలుగుచూసింది. ఆస్తి కోసం కట్టుకున్న భర్తను అతని తల్లిని బయటికి గెంటిందీ ఓ ఇల్లాలు.


కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని చౌడమ్మ వీధిలో ఆస్తి కోసం కట్టుకున్న భర్తను ఆమె అత్తను బయటికి గెంటిందీ ఓ ఇల్లాలు. గత కొంతకాలంగా వారు ఉంటున్న ఇంటి కోసం గొడవ జరుగుతుంది. అయితే, భర్త అలాగే అత్త ఇద్దరు బయటికి వెళ్లిన సమయంలో కోడలు ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లిపోయింది ఇదేమిటి అని ప్రశ్నిస్తే, ఇది తనకు సంబంధించిన ఆస్తి మీకు చెందదు ఇది తన ఆస్తి అంటూ కరాఖండిగా తెగేసి చెప్పింది.

అసలు విషయానికి వస్తే, గత 15 ఏళ్లుగా శ్యామలాదేవి ఆమె భర్త నాగరాజు ఇద్దరూ ఎడ మొహం పెడ మొహం గానే ఉంటున్నారు. అయితే నాగరాజు తల్లి లక్ష్మమ్మ వారిద్దరిని కలపడం కోసం ఉన్న ఆస్తిలో కొంత అమ్మి వారిద్దరితో వ్యాపారం పెట్టించింది. అయినా కానీ సఖ్యతగా లేకుండా ప్రతిసారీ గొడవ పడుతూనే ఉన్నారు. ఆస్తికోసం మామను గతంలో చిత్రహింసలు పెట్టిందని ఆ కారణంగానే అతను చనిపోయాడని అత్త లక్ష్మమ్మ వాపోతోంది. ఇంకా తన ఆశ చావలేదని ఉన్న ఒక్కగానొక్క ఇల్లు కూడా లాగేసుకోవాలని తన బంధువులతో ప్రయత్నం చేస్తుందని లక్ష్మమ్మ గోడు వెళ్లబోసుకుంది.


ఆరు పదుల వయసు దాటిన తాను, సొంత ఇంటి ముందే నిరసన చేస్తానని ఏనాడు అనుకోలేదన్నారు. పోలీసుల దగ్గరకు వెళ్లినా ఎటువంటి న్యాయం జరగడం లేదని ఆమె వాపోతోంది. గతంలో అనేకమార్లు వారిద్దరిని కలిపేందుకు ప్రయత్నించానని కానీ ఈసారి ఏకంగా భర్తను కూడా బయటకు గెంటేసిందని లక్ష్మమ్మ తన కోడలు శ్యామలాదేవి పై మరోమారు పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. ఏది ఏమైనా ఆస్తి మొత్తం లాక్కున్న ఇంకా తనకు మమకారం కలగడం లేదని కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటకు నెట్టేసి తాళాలు వేసుకుని వెళ్లిపోయిందని శ్యామలాదేవి అత్త లక్ష్మమ్మ వాపోతుంది. ఆస్తికోసం బంధాలకు బంధుత్వాలకు విలువ లేకుండా ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదని మీడియాను ఆశ్రయించింది. ఏది ఏమైనా ఆస్తికున్నంత విలువ ఈ కాలంలో బంధాలకు బంధుత్వాలకు లేదని ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు నిరూపిస్తూనే ఉన్నాయి.

Also read

Related posts

Share via