April 11, 2025
SGSTV NEWS
Andhra PradeshTrending

ఆలయంలోకి వచ్చిన నాగుపాము.. ఓ ఆటాడుకున్న పిల్లులు.. ఎక్కడంటే..?




శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని బృందావన చంద్ర ఆలయంలో ఒక పాము కలకలం సృష్టించింది. సమీప పొదల నుంచి ఆలయ ప్రాంగణంలోకి ఒక నాగు పాము ప్రవేశించింది.


శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని బృందావన చంద్ర ఆలయంలో ఒక పాము కలకలం సృష్టించింది. సమీప పొదల నుంచి ఆలయ ప్రాంగణంలోకి ఒక నాగు పాము ప్రవేశించింది. ఆలయంలోకి వెళ్లే క్రమంలో అక్కడే తిరుగాడుతున్న రెండు పిల్లులు నాగు పామును గమనించాయి. పాము, పిల్లులు ఎదురెదురుగా తారసపడటంతో జాతి వైరoతో అవి కయ్యానికి కాలుదువ్వాయి.


ఆలయంలోకి వచ్చిన నాగుపాము పడగవిప్పి బుసలు కొడుతోంది. ఇంతలో అటుగా వెళుతున్న రెండు పిల్లులు పామును లోపలకి వెళ్ళకుండా ఆటకాయించాయి. ఈ ఘటనను చూసిన మరో నల్ల మచ్చల పిల్లి అక్కడకు చేరుకుంది. మూడు పిల్లులు కలిపి పామును ఆటకాయించాయి. కాసేపు అలా గడిచిపోయాక ఎటువంటి బెదురు లేకుండా నాగుపాము మెల్లగా అక్కడ నుంచి పొదల్లోకి జారుకుంది. దీంతో పిల్లులు చేరోదారి చూసుకున్నాయి. మొత్తానికి చూసే వారందరికీ కాసేపు ఒళ్ళు గగుర్పొడిచింది ఈ దృశ్యం. ఈ ఘటన మొత్తాన్ని స్థానికులు సెల్‌ఫోన్ కెమెరాలలో షూట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి

Also read

Related posts

Share via