సన్నీతో సన్నిహితంగా ఉండడం చూసి భరించలేకపోయారు యువతి బంధువులు. సన్నీని కొట్టడం తట్టుకోలేక అశ్విని పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.
కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నగరూర్‌లో ఓ యువకుడిపై యువతి బంధువులు దాడి చేశారు. యువకుడు సన్నీకి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సన్నీని కొట్టడం తట్టుకోలేక అశ్విని పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. అశ్విని మృతికి సన్నీయే కారణమంటున్నారు యువతి తల్లిదండ్రులు. తమ కూతురిని ప్రేమ పేరుతో వేధించేవాడని యువతి తండ్రి వీరేష్ ఆరోపిస్తున్నారు.
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామానికి చెందిన నరసన్న చిన్న వీరేష్ దంపతులకు అశ్విని ఏకైక కూతురు. పత్తికొండ మోడల్ స్కూల్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన సన్నీ అనే యువకుడితో సన్నిహితంగా ఉండేది. దసరా సెలవుల కోసం వచ్చి ఇంకా కాలేజీకి వెళ్లలేదు. అయితే శుక్రవారం(అక్టోబర్ 18) అశ్విని ఇంట్లోనే ఉండగా పేరెంట్స్ పొలానికి వెళ్లారు. ఇదే సమయంలో సన్నీ ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో ఇద్దరు ఉన్న సమయంలో గమనించిన బంధువులు ఒక్కసారిగా దాడి చేశారు.
అశ్విని బంధువుల దాడిలో సన్నీ తీవ్రంగా గాయపడ్డాడు. సన్నీని కొట్టడం తట్టుకోలేక పురుగుల మందు సేవించిన అశ్విని ప్రాణాపాయ స్థితిలోకి చేరుకుంది. దీంతో పొలం నుంచి వచ్చిన పేరెంట్స్ గమనించి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అశ్విని మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సన్నీ మరో ఆసుపత్రిలో కోలుకుంటున్నాట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం అశ్విని మృతి దేహాన్ని ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే తండ్రి వాదన మరోలా ఉంది. అశ్విని మృతికి సన్నీ ఒత్తిడే కారణమని, ప్రేమిస్తావా లేదా అంటూ ఒత్తిడి చేశారని, అందుకే పురుగుల మందు సేవించిందని అశ్విని తండ్రి చిన్న వీరేష్ ఆరోపిస్తున్నారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025