ఎక్కడ మొదలు పెట్టారో… ఆయన రాజకీయప్రస్థానం మళ్లీ అక్కడికే చేరబోతుందా? ప్రాయశ్చిత పథంతో జనసేనలోకి రీ -ఎంట్రీకి రూట్ క్లియర్ చేసుకున్నారా? పవన్ వరమిచ్చినా జనసైన్యం నో అంటే పరిస్థితి ఏంటీ? ప్లాన్ బీ- టీడీపీ..అక్కడ కుదరకపోతే బీజేపీ.వలసరాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్
కోనసీమ పాలిటిక్స్‌లో కొంగొత్త ట్విస్ట్‌లు తెరపైకి వస్తున్నాయి. లేటెస్ట్‌గా రాజోలులో కూటమి రుచి రంగు వాసనలతో వలసలు ఘాటెక్కుతున్నాయి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అనే మాట సహా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులూ ఉండరనే లెక్క ఎటూ వుండనే వుందిగా… ఇలా దూకడానికి దారి క్లియరికాగానే..అలా కండువా ఎందుకు మార్చాల్సి వచ్చిందో చెప్పడానికి ఓ రాయి వేయడం పరిపాటినే కదా. కోస్తాలో..సీమలో వలసలు పోటెత్తుత్తున్నాయి.. ఆ కోవలో కోనసీమలో రాజోలు ఆవాజ్ రానే వచ్చింది. వైసీపీకి టాటా బైబై అనేశారు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.
ఫ్యాన్‌ను స్విచ్చాఫ్ చేస్తామనేశారు సరే, మరి ఇక సారు సైకిల్ ఎక్కేస్తారా? లేదంటే భాయ్ భాయ్… గరం గరం ఛాయ్ ఛాయ్ అంటూ గాజు గ్లాసే శరణ్యం అంటారా? ఇటు, అటు కాకపోతే కమలానికి దగ్గరయ్యేలా ఏదైనా స్కెచ్చేశారా? అని రాజోలు రాజకీయంలో గుసగుసలు గుప్పుమంటున్నాయి. ఎమ్మెల్యేగా రాపాక ప్రస్థానం ఎక్కడ మొదలు పెట్టారో మళ్లీ అక్కడికే చేరుకున్నారనే టాక్ పీక్స్‌కు వెళ్లింది. ఇటీవల జనసేన మీటింగ్‌ల్లో తళుక్కుమంటున్నారాయన. పిలిస్తే వెళ్తున్నారా? వచ్చేస్తాను పిలవమని అడగడానికి వెళ్తున్నారా? అనే చర్చ రాజోలులో మొదలైంది. తాజాగా మలికిపురం జనసేన మీటింగ్‌లో మళ్లీ తళుక్కుమన్నారు రాపాక వరప్రసాద్. జనసేన మీటింగ్‌లకు రావడం ఇది రెండోసారి. ఎమ్మెల్యే దేవవరప్రసాద్‌ను కలిశారు. మ్యాటరేంటని పది మంది మాట్లాడుకుంటారుగా.. చెప్పకుంటే ఎలా?… ఏదో ఒకటి చెప్పాలి కదా.. పెండింగ్ పనులను పూర్తి చేయాలని.. ఆ వివరాలను అందించేందుకే ఎమ్మెల్యేను కలిశానని వివరణ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే రాపాక.
మాటిమాటికి జనసేన మీటింగ్‌ల్లో కన్పించడం వెనుక మర్మమేంటి? పోతేపోయినా మళ్లీ రావచ్చు అనే వరం ప్రసాదిస్తారనే ప్రయత్నమా? తనను కరివేపాకు చేశారనే వైసీపీపై కోపమా? మార్పుపథంపై తన మన్ కీ బాత్ చెప్పారు. త్వరలో వైసీపీ పార్టీని వీడబోతున్నానని ప్రకటించారు. ఇప్పటికే వైసీపీ పార్టీ పెద్దలకు ఈ విషయం తెలియజేశానన్నారు. తాను జనసేన ఎమ్మెల్యేగా గతంలో ఉంటూ అనివార్య కారణాలవల్ల వైసీపీలో కొనసాగానని పేర్కొన్నారు. అమలాపురంలో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఓడిపోతానని ముందే తెలుసని సెలవిచ్చారు కూడా
మొన్నటి ఎన్నికల్లో జనసేన వందకు వందశాతం హిట్ కొట్టింది. కానీ అంతకు ముందు ఎన్నికల్లో హోల్ ఆంధ్రాలో ఆ పార్టీకి వచ్చింది ఒకే ఒక్క సీటు. ఒకే ఒక్కడుగా అసెంబ్లీకి అడుగు పెట్టిన రాపాక వరప్రసాద్ అప్పట్లో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్నాడు. రాను రాను పార్టీకి దూరం అవ్వడం.. ప్రభుత్వానికి దగ్గరవ్వడం.. జనసేనలోనే ఉంటూ వైసీపీ అనుకూలంగా వ్యవహారించడం… అవన్నీ జనం ఎరిగినవే. ఓడిపోతానని ముందే తెలిసినా వైసీపీ చెంతన వున్న రాపాక వరప్రసాద్ కూటమిలో చేరాలని స్ట్రాంగ్‌గా డిసైడయినట్టు ఆయన మాటల్లోనే క్లియర్ కట్‌గా తేలింది. కానీ రాజోలు జనసైనికులు మాత్రం బాహాటంగానే ఆయనకు నో ఎంట్రీ అంటున్నారు . దాంతో టీడీపీలో చేరడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారనే ప్రచారం హోరెత్తిందింది. ఆ ముచ్చట తన చెవిన కూడా పడిందని స్పందించారు రాపాక.
వెళ్లడానికి ఇటు వైపు నుంచి రెడీగా వున్న అటు వైపు నుంచి రా..కదలిరా అనే పిలుపు ఇంకా రాన్నట్టుగా వుంది. వస్తుందా? రాదా? రాకపోతే నెక్ట్స్ రూటేంటి?…. మార్పు వికాసంతో కమలం గూటికి చేరుతారా? పట్టువదలని వరప్రసాద్ అన్పించుకుంటూ మళ్లీ గాజు గ్లాజునే పట్టుకుంటారా? అన్నది ప్రజంట్ సస్పెన్స్. జనసేనలో చేరడమే లక్ష్యం… పిలిచినా పిలవకున్నా జనసేన మీటింగ్‌లకు వెళ్లడమే మార్గం అన్నట్టుగా రాపాక… తన రాజకీయ భవిష్యత్‌కు మాంచి బాట వేసుకుంటున్నారనే చర్చ రాజోలులో జరుగుతోంది. ఏ గట్టున చేరినా సరే ఉండేది కూటమి జట్టులోనే కదా. వారెవ్వా వాటన్ ఐడియా రాపాకా..అంటున్నారు స్థానికులు. మరి వరప్రసాద్ కల వరమవుతుందా? ఇన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ కలవరమే మిగులుతుందా? చూడాలిక.
Also read
- నేటి జాతకములు..4 ఏప్రిల్, 2025
- శ్రీ కృష్ణుడు మనవడు వజ్రనాభుడు నిర్మించిన ఆలయం ద్వారకాధీష ఆలయం.. ప్రాముఖ్యత ఏమిటంటే
- Dreams Theory: ముద్దు పెట్టుకుంటున్నట్లు కల కంటున్నారా.. ఆ కలకు అర్ధం తెలిస్తే ఆశ్చర్యపోతారు.
- కామదా ఏకాదశి: స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే కామద ఏకాదశి ఎప్పుడు? పూజా శుభ సమయం? నియమాలు
- Horoscope April 2025: ఏప్రిల్‌లో ఐదు గ్రహాల సంచారం.. ఈ మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..