దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మీపై కేసులు నమోదయ్యాయి.. సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడానికి వస్తున్నారంటూ బెదిరిస్తున్నారు. మీపై ఉన్న కేసులు మాఫీ కావాలంటే డబ్బులు ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారు. ఆ తర్వాత బ్యాంకు స్టేట్మెంట్స్, ఓటీపీలు రాబట్టి… అకౌంట్‌లో ఉన్న డబ్బును కొట్టేస్తున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఓ డాక్టర్ కు ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు.. భారీగా దోచుకున్నారు.. ఈ సంచలన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.. నంద్యాలలో ప్రముఖ డాక్టర్ రామయ్యను మోసం చేశారు సైబర్ నేరగాళ్లు.. ఒకటి రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.38లక్షల వరకు డబ్బులను కొల్లగొట్టారు.
ముందు రామయ్యకు ఫోన్ చేసిన నిందితులు.. ఢిల్లీ సీబీఐ ఆఫీస్ నంచి మాట్లాడుతున్నామంటూ మాటాలు కలిపారు.. ఆ తర్వాత ఛీటింగ్ కేసులు నమోదయ్యాయంటూ బెదిరించి డాక్టర్ రామయ్య నుంచి 38లక్షలు కాజేశారు.
వీడియో చూడండి..
రామయ్యకు ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఢిల్లీలో చీటింగ్ కేసు నమోదైందనీ, డబ్బు పంపిస్తే కేసు మాఫీ చేస్తామని.. ఫేక్ సీబీఐ ఆఫీసర్‌తో మాట్లాడించారు. చివరకు ఇలా బెదిరించి, డాక్టర్ అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నంద్యాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించించారు.
సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులకు సంబంధించి అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. పలువురు ప్రముఖులు, చదువుకున్న వ్యక్తులు మోసపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.. ఎవరైనా ఫోన్ చేసి కేసులు, అరెస్ట్ అంటూ బెదిరిస్తే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు
Also read
- వధూవరుల చేతిలో కొబ్బరిబోండమే ఎందుకు ఉంచుతారు.. దీని వెనక ఇంత స్టోరీనా?
- Adhi Yoga: ఈ రాశుల వారికి త్వరలో అధికారం, ఆదాయం! ఇందులో మీ రాశి ఉందా?
- రేపే గురుపౌర్ణమి.. ఈ 5 ప్రదేశాల్లో ఆవు నెయ్యి దీపాలు వెలిగించండి.. జీవితంలో డబ్బుకు లోటు ఉండదు..
- Guru Purnima 2025: గురువారం గురు పౌర్ణమి.. ఈ రాశులపై బృహస్పతి ఆశీస్సులు.. చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే..
- నేటి జాతకములు..10 జూలై, 2025