April 19, 2025
SGSTV NEWS
CrimeTelangana

వీడో సోషల్ మీడియా కంత్రీగాడు.. మీకే తెలియకుండా అశ్లీల ఫొటోలు ఇన్‌స్టాలో పెట్టేస్తాడు!

ఇతడు సోషల్ మీడియా కంత్రి.. బైక్‌లపై తిరుగుతూ కనబడ్డా అమ్మాయిలను వారికే తెలియకుండా ఫొటోలు తీస్తాడు. ఆ తర్వాత వాటిని ఎడిట్‌ చేసి తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేస్తాడు. ఇలా షేర్‌ చేసిన అమ్మాయిల అసభ్యకర ఫోటోలు అతడి వద్ద కుప్పలు తెప్పలుగా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఎట్టకేలకు కటకటాల్లో వేశారు..


జగిత్యాల, జనవరి 16: సోషల్ మీడియా వేదికలపై ఇష్టారీతిన వ్యవహరిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని పోలీసులు పదే పదే చెప్తున్నా కొంతమంది వైఖరిలో మార్పు రావడం లేదు. తమ అతి తెలివితో పెడదారిలో పయనిస్తున్న వారు పోలీసులకు రెడ్ హైండెడ్ గా దొరికిపోతున్నారు. మహిళలకు సంబంధించి అభ్యంతరకరంగా ఎడిట్ చేసి ఇన్‌స్టా అకౌంట్ లో షేర్ చేస్తున్న ఓ ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపాల్ పూర్ కు చెందిన బండారి శ్రవణ్ జగిత్యాల పట్టణంలోని అంగడి బజార్ లో షాపు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో తిరుగుతూ మహిళల ఫోటోలు తీస్తూ వాటిని ఎడిట్ చేసి ”థైస్ అండ్ లెగ్స్” అనే పేరుతో ఓపెన్ చేసి తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేస్తున్నాడు.


ఈ నెల 11న జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు వాహనాలపై తిరుగుతూ మహిళలను ఫొటో తీసి వాటిని ఎడిట్ చేసి ”థైస్ అండ్ లెగ్స్” ఇన్ స్టా అకౌంట్‌లో షేర్ చేస్తున్నాడని, వీటికి వచ్చే అసభ్యకరమైన కామెంట్లను కూడా పోలీసులు గుర్తించి నిందితునిపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. నిందితుడు బండారి శ్రవణ్ అరెస్ట్ అనంతరం, అతడు కొనసాగిస్తున్న సదరు ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ను బ్లాక్ చేయించామని డీఎస్పీ రఘు చందర్ మీడియాకు తెలిపారు.

అయితే.. చాలా మంది అమ్మాయిలు ఇలాంటి సైకోల కారణంగా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దొంగ చాటుగా ఫోటోలు తీసి.. ఇన్స్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారని డీఎస్పీ తెలిపారు. నిందితుడు బండారి శ్రవణ్ వద్ద ఇలాంటి ఫేక్ ఫొటోస్ అనేకం ఉన్నట్లు వెల్లడించారు. ప్రజలు ఎవరైనా తమ చుట్టుపక్కనున్న వారిపై ఏ చిన్న పాటి అనుమానం వచ్చినా తమకు పిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాపై మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.

Also Read

Related posts

Share via