SGSTV NEWS
CrimeTelangana

Telangana: ప్రియురాలితో ఏడడుగులు నడవాలనుకున్నాడు.. తీరా పెద్దలకు చెప్పిన మరుసటి రోజే..



ప్రేమించిన ప్రియురాలిని పెళ్లి చేసుకుందామని దుబాయ్ నుంచి వచ్చాడు ఓ యువకుడు. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పాడు..అయితే వాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం యూసుఫ్ నగర్‌కి చెందిన వినయ్ ఐదు రోజుల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. వినయ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. నాలుగేళ్లుగా పరస్పరం ప్రేమించుకున్నారు. వినయ్ దుబాయ్‌లో ఉపాధి కోసం వెళ్ళాడు. అయితే శ్రావణమాసంలో పెళ్లి చేసుకోవడానికి స్వగ్రామానికి వచ్చాడు. అయితే ప్రేమ పెళ్లి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. అందుకు అతడి కుటుంబం ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే మృతి చెందారని డాక్టర్స్ ధృవీకరించారు. యువకుడు ఆత్మహత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరితో కలుపుగోలుగా ఉండే వినయ్ ఈ రకంగా ఆత్మహత్య చేసుకుంటారని ఎవరు ఊహించలేదని కన్నీటి పర్యంతం అవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులు కూడా ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చనిపోతున్నారు. ప్రేమ జంటలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. అయితే కొంత సమయం కుటుంబ సభ్యులకు ఇచ్చి పెళ్లికి ఒప్పించాలని.. ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకోవద్దని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు


Also read


Related posts

Share this