సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి చెందిన ముత్యాల హరీష్ (25) అనే యువకుడు లోన్ యాప్ నుంచి 5 వేల నాలుగు వందలు లోన్ పొందాడు. 10 రోజుల తర్వాత యాప్ సిబ్బంది ఫోన్ చేసి 9 వేలు అప్పు కట్టాలని, లేకుంటే అశ్లీల ఫోటోలు మీ బంధువులకు పంపిస్తామని బెదిరించారు.
లోన్ యాప్‌ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.. లోన్ చెల్లించినా వేధింపులు ఆగడం లేదు.. అడ్డగోలుగా వ్యవహరిస్తూ అమాయకుల ప్రాణాలను తీసుకుంటున్నారు. అధికంగా వడ్డీలు వేయడం, అక్రమంగా డబ్బులు వసూలు చేయడం.. స్పందించని పక్షంలో లోన్ తీసుకున్న వారిని, వారి కుటుంబ సభ్యులను, స్నేహితులను వేధించడం.. బెదిరించడం, అసభ్యకరమైన ఫోటోలను మార్ఫింగ్ చేసి పంపడం లాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు అనేకం ఉన్నాయి.. లోన్ తీసుకున్న వారిని చిత్రహింసలకు గురి చేసి.. రక్తం తాగుతున్న లోన్ యాప్ నిర్వాహకులు.. తాజాగా మరొకరిని పొట్టన పెట్టుకున్నారు.
లోన్ యాప్ వేధింపులకు తెలంగాణలో మరో యువకుడు బలయ్యాడు.. లోన్ యాప్ ఆగడాలు రోజు రోజుకు ఎక్కువ కావడంతో.. ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరులో చోటుచేసుకుంది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా హరీష్ అనే యువకుడు పురుగుల మందు బలవన్మరణానికి పాల్పడ్డాడు.. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వివరాల ప్రకారం..
సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి చెందిన ముత్యాల హరీష్ (25) అనే యువకుడు లోన్ యాప్ నుంచి 5 వేల నాలుగు వందలు లోన్ పొందాడు. 10 రోజుల తర్వాత యాప్ సిబ్బంది ఫోన్ చేసి 9 వేలు అప్పు కట్టాలని, లేకుంటే అశ్లీల ఫోటోలు మీ బంధువులకు పంపిస్తామని బెదిరించారు. హరీష్ అసలు కట్టాల్సింది రూ.5 వేలు మాత్రమే.. కానీ కేవలం 10 రోజులకు 9 వేలు కట్టాలని బెదిరిస్తూ వేదింపులకు గురి చేశారు. దీంతో హరీష్ కొంత సమయం ఇవ్వాలని వారిని రిక్వెస్ట్ చేశాడు.. అయినా.. వారు ఏమాత్రం పట్టించుకోలేదు.. అసభ్య పదజాలంతో దూషించారు.. అంతటితో ఆగకుండా బాధితుడు ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి .. వాటిని హరీష్ బంధువులకు పంపారు.. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన హరీష్.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వేంసూరు మండలం దుద్దిపూడి గ్రామం వద్ద హరీష్ పురుగుల మందు తాగినట్లు పోలీసులు తెలిపారు. హరీష్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ముత్యాల హరీష్ మృతి చెందాడు. ఈ ఘటనపై వేంసూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025