మధ్యలో చదువు మానేశాడు.. ఏదో ఒక్క పని చేసుకోవాలని నాలుగు మంచి ముచ్చట్లు చెప్పాడు తండ్రి..! అయితే, టైమ్ పాస్ కావడం లేదని ఆన్‌లైన్ గేమ్స్ అలవాటు పడ్డాడు.. మొత్తం సెల్‌ఫోన్‌కు అంకితం అయ్యాడు. ఆడవద్దని.. కొడుకుకు తండ్రి కొంచెం గట్టిగా చెప్పాడు. చిన్నపాటి కారణంతో బలవన్మరణానికి పాల్పడ్డ కొడుకు ఆ కుటుంబానికి కడుపుకోత మిగిల్చాడు. చేతికందిన కొడుకు మృతితో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది.
జగిత్యాలలో మరో యువకుడు ఆ గేమింగ్ మాయ బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. విద్యానగర్‌కు చెందిన రాహుల్.. బీటెక్ మధ్యలో మానేశాడు. కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఎలాంటి పని లేకుండా ఖాళీగా ఉంటున్నాడు. సమయం గడపటానికి ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టాడు. కానీ అది అలవాటై.. మత్తుగా మారింది. ప్రతిరోజూ ఫోన్‌లో గేమ్స్ ఆడుతుండటంతో తండ్రి శ్రీనివాస్ మందలించారు. ఏదైనా పని చేసుకోవాలని సూచించాడు.. ఇలాంటి గేమ్స్ ఆడవద్దని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
కానీ ఆ మందలింపు తో రాహుల్ తండ్రిపై కోపం పెంచుకున్నాడు. ఎదో ఒక్కటీ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయం లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకుని కోల్పోయిన తల్లిదండ్రులు విలపిస్తున్నారు. బుద్ది మాట చెబితే.. ఇలా ఎందుకు చేసుకున్నవని రోదిస్తున్నారు. కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- Telangana: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. గన్‌తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్‌లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





