వికారాబాద్ జిల్లా బహీరాబాద్‌లోని నవాంద్గీ రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలు చివరలో కింద నుంచి ఆటువైపుగా దాటి వెళ్లేందుకు ఓ గుర్తు తెలియని మహిళ ప్రయత్నం చేసింది. అయితే ఇంతలో ఆ రైలు అకస్మాత్తుగా కదిలింది. తొలుత కొంత కంగారు పడినా.. ఆ తర్వాత ఆమెకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సదరు మహిళ రైలు కింద పట్టాల మధ్యన తల వంచి అలాగే పడుకుని పోయింది. ఆమెను గమనించిన..
బషీరాబాద్, ఆగస్టు 26: ఓ మహిళ రైల్వే ట్రాక్ దాటుతుండగా హఠాత్తుగా గూడ్స్ రైలు దూసుకొచ్చింది. అయితే మహిళ సమయ స్పూర్తితో వ్యవహరించిన విధానం ఆమె ప్రాణాలను కాపాడింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవాంద్గీ రైల్వేస్టేషన్‌లో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
వికారాబాద్ జిల్లా బహీరాబాద్‌లోని నవాంద్గీ రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలు చివరలో కింద నుంచి ఆటువైపుగా దాటి వెళ్లేందుకు ఓ గుర్తు తెలియని మహిళ ప్రయత్నం చేసింది. అయితే ఇంతలో ఆ రైలు అకస్మాత్తుగా కదిలింది. తొలుత కొంత కంగారు పడినా.. ఆ తర్వాత ఆమెకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సదరు మహిళ రైలు కింద పట్టాల మధ్యన తల వంచి అలాగే పడుకుని పోయింది. ఆమెను గమనించిన అక్కడే ఉన్న స్థానిక యువకుడు రైలుకిందకు వెళ్లిన మహిళతో మధ్యలో కింద పడుకోమని చెప్పి, ఈ మొత్తం దృశ్యాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. రైలు వెళ్లేవరకు మహిళ ఆలాగే ఉండింది. రైలు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ మహిళ పైకిలేచి మెళ్లగా అవతలికి రావడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం