SGSTV NEWS
CrimeTelangana

తాంత్రికపూజల నెపంతో మహిళ సజీవదహనం.. ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన గ్రామస్థులు

మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం కాట్రియాలలో మహిళను సజీవదహనం చేశారు. పోలీసుల కథనం ప్రకారం..

రామాయంపేట: మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం కాట్రియాలలో మహిళను సజీవదహనం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ద్యాగల ముత్తవ్వ ఇంట్లో ఉండగా గురువారం రాత్రి గ్రామస్థులు ఆమెపై దాడి చేశారు. మంత్రాల నెపంతో పెట్రోల్ పోసి నిప్పంటించారు. అరుపులు విని స్థానికులు కొందరు ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మృతదేహాన్ని పోలీసులు రామాయంపేట ఆసుపత్రికి తరలించారు. దాడి భయంతో మృతురాలి కుమారుడు, కోడలు పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి
పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

Also read

Related posts

Share this