ఏం కష్టం వచ్చిందో ఓ వివాహిత నిండు కుండలా పారుతున్న నదిలో దూకి ఆత్మహత్యా యత్నం చేసింది. మెరుపు వేగంతో స్పందించిన స్థానికులు ఆమెను కాపాడటంతో ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో..
కరీంనగర్, సెప్టెంబర్ 23: ఏం కష్టం వచ్చిందో ఓ వివాహిత నిండు కుండలా పారుతున్న నదిలో దూకి ఆత్మహత్యా యత్నం చేసింది. మెరుపు వేగంతో స్పందించిన స్థానికులు ఆమెను కాపాడటంతో ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం..
కరీంనగర్ ఎల్ఎండీలో టూరిస్ట్ బోటులో పర్యాటకులతోపాటు సంధ్య అనే వివాహిత కూడా టికెట్ కొనుక్కుని బోటు ఎక్కి కూర్చుంది. అయితే బోట్ స్పీడ్ పెంచగానే వెనక్కి వెళ్లి నీటిలో అమాంతం దూకేసింది. వెంటనే గమనించిన బోట్ డ్రైవర్, బోటులో ప్రయాణిస్తున్న మరికొందరు బోటును నీళ్లపై ఆపేసి ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. సేఫ్టీ ప్యాడ్స్ నీళ్లలో వదిలి ఆమెను క్షేమంగా బోటులోకి లాగి రక్షించారు. అనంతరం లేక్ పోలీసులకు సమాచారమిచ్చి సదరు మహిళను ప్రభుత్వ హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా సంథ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





