SGSTV NEWS
CrimeTelangana

ఆర్టీసీ బస్సులో బానెట్పై కూర్చోవద్దన్నందుకు.. కండక్టర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ!

అల్లరిమూకలు చెలరేగిపోయారు. మహిళకు మర్యాద ఇవ్వలేదంటూ ఆర్టీసీ బస్సుపై తమ ప్రతాపం చూపించారు. కండక్టర్‌పై దాడి చేసిన వ్యక్తి, అడ్డొచ్చిన ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో వెలుగు చూసింది.

Also read :*మాదిగల పోరాట విజయానికి బ్రాహ్మణ అభినందనలు…

అల్లరిమూకలు చెలరేగిపోయారు. మహిళకు మర్యాద ఇవ్వలేదంటూ ఆర్టీసీ బస్సుపై తమ ప్రతాపం చూపించారు. కండక్టర్‌పై దాడి చేసిన వ్యక్తి, అడ్డొచ్చిన ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో వెలుగు చూసింది.

ఆత్మకూరు మండలం భూపాలపట్నం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులో మహిళ ప్రయాణికురాలి బందువులు వీరంగం సృష్టించారు. హన్మకొండ డిపో నుండి ఏటూర్‌నాగారం వెళుతుండగా ఆత్మకూరులో వాగ్వాదం జరిగింది. మొదట మహిళా ప్యాసింజర్ తో కండెక్టర్ కు తలెత్తిన వివాదం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుల దాకా వెళ్ళింది.

Also read :మూవీల్లో ఛాన్సులంటూ సాఫ్ట్ వేర్ యువతిపై అసిస్టెంట్ డైరెక్టర్ అఘాయిత్యం..!

ఏటూర్‌నాగారం వైపు వెళ్తున్న మహిళ ప్యాసింజర్ బస్సులో సీటు లేకపోవడంతో డ్రైవర్ పక్కన ఉండే ఇంజన్ బానెట్‌పై కూర్చున్నారు. అయితే అక్కడ కూర్చొవద్దని వారించిన కండక్టర్.. మహిళతో వాగ్వివాదానికి దిగాడు. అయితే ఇక్కడే కూర్చుంటానని మహిళా ప్యాసింజర్ దురుసుగా వ్యవహారించింది. దీంతో మహిళా ప్యాసింజర్‌పై స్థానికంగా ఉన్న ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు బస్సు కండక్టర్. ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులకు చేరవేసింది సదరు మహిళ.

వీడియో…

దాంతో దాదాపుగా ముప్పై కిలోమీటర్ల తరువాత బస్సును వెంబడి అడ్డుకున్నారు మహిళ కుటుంబసభ్యులు. బస్సుకు బైక్ అడ్డుగా పెట్టి కండక్టర్ పై దాడికి దిగాడు మహిళా ప్యాసింజర్ కొడుకు మోహన్. కాగా, ఈ ఘటనపై ములుగు జిల్లా కేంద్రంలో మరోసారి కేసు నమోదు చేశారు పోలీసులు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి పాల్పడిన మోహన్ కమలాపూర్ మండల వాసిగా గుర్తించారు

Also read :అమాయకంగా కనిపిస్తున్న యువతి.. ఈమె చేసిన పని తెలిస్తే షాకే!

Related posts

Share this