మెదక్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాదాసు శ్రీకాంత్(29) అనే యువకుడిని, తండ్రి మాదాసు దుర్గయ్య కత్తితో నరికి హత్య చేశారు. మద్యం మత్తులో నిద్రపోతున్న కొడుకును హతమార్చిన దుర్గయ్య, నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
కడవరకు కంటికి రెప్పలా చూసుకోవాల్సిన, తల్లిదండ్రులను కొంతమంది పిల్లలు నిత్యం వేధిస్తూ వారికి మనోవేధనను మిగులుస్తున్నారు. మద్యానికి బానిసై తల్లిదండ్రులపై దాడులకు సైతం తెగపడుతున్నారు. ఇలా మద్యానికి బానిసై నిత్యం తల్లిదండ్రులకు నరకం చూపిస్తున్న కొడుకుపై, విసిగివేసారిన ఓ తండ్రి కఠినంగా వ్యవహరించాడు. కొడుకు వేధింపులను తట్టుకోలేక అతన్ని చంపేసి, నేరుగా పోలీసు స్టేషన్ కి వెళ్లి, విషయం చెప్పి లొంగిపోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాదాసు శ్రీకాంత్(29) అనే యువకుడిని, తండ్రి మాదాసు దుర్గయ్య కత్తితో నరికి హత్య చేశారు. మాదాసు దుర్గయ్య కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కాగా టైలర్ పని చేసుకుని జీవనం సాగిస్తున్న దుర్గయ్య ఉన్న ఒక్క కూతురు వివాహం చేశారు. చిన్న కుమారుడైన శ్రీకాంత్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నారు.
అయితే గత పది సంవత్సరాలుగా శ్రీకాంత్ ఫుల్‌గా మద్యాని బానిస అయ్యాడు. ప్రతిరోజు మద్యం తాగి ఇంటికి రావడం.. తరుచు ఎదో ఒక రకంగా, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులతో గొడవ పడడంతో పాటు, వారిపై దాడికి తెగబడ్డాడు. కాగా సంక్రాంతి పండుగ నుండి ఇంట్లో గతం కంటే, ఎక్కువగా గొడవలు పడుతూ తల్లిదండ్రులపై తీవ్రస్థాయిలో దాడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గురువారం(జనవరి 16) రాత్రి కూడా శ్రీకాంత్, తన తండ్రి దుర్గయ్యతో గొడవపడి, చెప్పుతో తండ్రిపై దాడి చేశాడు.కన్న కొడుకు తనను చెప్పుతో కొట్టడాన్ని జీర్ణించుకోలేని దుర్గయ్య తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. రాత్రి మద్యం సేవించి పడుకున్న కుమారుడు శ్రీకాంత్‌పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, జరిగిన విషయం చెప్పి లొంగిపోయాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు
Also read
- కుమార్తె భవిష్యత్తు కోసం తండ్రి కిడ్నీ అమ్మేస్తే.. కానీ భార్య మాత్రం..
- వివాహేతర సంబంధం: భర్తను చంపిన భార్య 10 మంది అరెస్టు
- ప్రియుడి కోసం ఇల్లు వదిలి.. పోలీసుల చేతిలో..!
- రథ సప్తమి విశిష్టత
- భార్యపై అనుమానం.. బాయ్ ఫ్రెండ్ ఇంటికెళ్లి బ్యాగ్తో బయలుదేరిన భర్త.. ఆ తర్వాత..