April 16, 2025
SGSTV NEWS
CrimeTelangana

పుష్పా సీన్ తలదన్నేలా.. ఇలా కూడా స్మగ్లింగ్ చేయొచ్చా.. నివ్వెరపోయిన పోలీసులు..!



హైదరాబాద్ మహానగరంలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. ఇలా కూడా స్మగ్లింగ్ చేయొచ్చా అని పోలీసులే నివ్వెరపోయేలా చేసిందీ ఘటన. డ్రగ్స్‌ తరలిస్తున్న ఇద్దరిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 190 గ్రాముల హెరాయిన్, బైక్, మొబైల్స్ సహా ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ. 23 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు

హైదరాబాద్ మహానగరంలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. ఇలా కూడా స్మగ్లింగ్ చేయొచ్చా అని పోలీసులే నివ్వెరపోయేలా చేసిందీ ఘటన. డ్రగ్స్‌ తరలిస్తున్న ఇద్దరిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

గ్యాస్ సిలిండర్‌ పరికరాల వ్యాపారం ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 190 గ్రాముల హెరాయిన్, బైక్, మొబైల్స్ సహా ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ. 23 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన మహేష్, మహిపాల్ అనే ఇద్దరు అంతరాష్ట్ర నిందితులు.. హైదరాబాద్‌లో అధిక ధరలకు హెరాయిన్ విక్రయిస్తున్నారని సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.

రాజస్థాన్‌కు చెందిన మహేష్, మహిపాల్ అనే నిందితులిద్దరూ నేరేడ్‌మెట్‌ ప్రాంతంలో స్థిరపడ్డారు. వినియోగదారులకు డ్రగ్స్ చేరవేయడంలో రకరకాల మార్గాలు వెతుక్కుంటున్నారు. నిందితులు గ్యాస్ సిలిండర్ రిపేర్లు చేసే వారిగా పనిచేస్తున్నారు. ఆ గ్యాస్ రిపేర్‌కి సంబంధించిన పరికరాల్లో ప్యాక్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. అది కూడా ఎవరికీ కొంచెం కూడా అనుమానం రాకుండా.. గ్యాస్ సిలిండర్ వాల్వ్‌లలో ప్యాక్ చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఎవరి కోసం తెస్తున్నారు? లాంటి వివరాలను నిందితుల నుంచి సేకరించే పనిలో ఉన్నారు రాచకొండ పోలీసులు. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

Also read

Related posts

Share via