బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఓ విమానం వచ్చి ల్యాండ్ అయింది. ఓ మహిళ, ఇద్దరు వ్యక్తులు అవుట్ పాయింట్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యారు. వారి కదలికలు కొంచెం అనుమానాస్పదంగా ఉండటంతో.. కస్టమ్స్ అధికారులు చెక్ చేయగా.. దెబ్బకు షాక్ అయ్యారు.
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా దాదాపు 9 కిలోల గంజాయి ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ తతంగంలో ఇద్దరు వ్యక్తులతో పాటు ఓ మహిళ కూడా ఉండడం గమనార్హం. తనిఖీల్లో పట్టుబడిన గంజాయి ఆయిల్ విలువ దాదాపు 9 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. తరచుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి తరహా మాదకద్రవ్యాలు పట్టుబడడం చూస్తూనే ఉంటాం. అధికారులు ఎంత కట్టుదిట్టంగా చర్యలు చేపడుతున్నప్పటికీ ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు.
గతంలో సైతం గంజాయి పట్టుబడిన సంఘటనలను పరిశీలిస్తే.. పలు విచిత్రాలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. డ్రగ్స్, గంజాయి పట్టుబడిన ఘటనల్లో భారీ స్థాయిలో అధిక మొత్తంలో విలువ చేసే పదార్థాలు దొరికాయి. గతేడాది స్వీట్స్, చాక్లెట్ బాక్సుల్లో గంజాయిని తరలిస్తుంటే పట్టుబడిన ఘటనలు కూడా చూశాం. మరో ఘటనలో ఏకంగా విమానాశ్రయంలో పాములు కలకలం రేపిన సంగతి తెలిసిందే. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు మహిళల వద్ద విషపూరితమైన పాములను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజా ఘటనలో మరోసారి అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు మహిళను అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఈ ముగ్గురి వద్ద దాదాపు 9 కిలోల గంజాయి ఆయిల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇండిగో విమానంలో బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చినట్లుగా గుర్తించారు. ఈ మేరకు 9 కోట్లు విలువ చేసే గాంజా ఆయిల్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని, నిందితులను విచారణ చేపట్టారు
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!