SGSTV NEWS
CrimeTrending

Telangana: భర్త హత్యకు మూడు మేకల సుఫారి ఇచ్చిన భార్య.. ఎందుకో తెలుసా.?

కూతురి ప్రేమకు అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే హత్య చేయించింది భార్య. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని రాజీవ్ నగర్ కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. జూన్ 21న అర్థరాత్రి జరిగిన మెక్కం చిన్న ఆంజనేయులు హత్య మిస్టరీని ఛేదించారు పోలీసులు.

కూతురి ప్రేమకు అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే హత్య చేయించింది భార్య. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని రాజీవ్ నగర్ కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. జూన్ 21న అర్థరాత్రి జరిగిన మెక్కం చిన్న ఆంజనేయులు హత్య మిస్టరీని ఛేదించారు పోలీసులు. హత్యకు గల కారణాలు తెలుసుకుని నోరెళ్లబెట్టారు. ఇన్‌స్ట్రాగ్రాంలో పరిచయమైన ఓ యువకుడితో కూతురు ప్రేమ వ్యవహారం సాగిస్తుండగా.. వారి పెళ్లికి తండ్రి ఆంజనేయులు ఒప్పుకోలేదు. వద్దన్నా వినకుండా ప్రేమను కొనసాగిస్తుండడంతో కూతురిని మందలించాడు తండ్రి. ఇదే సమయంలో.. అడ్డుకోబోయిన భార్య భాగ్యలక్ష్మిపై చేయి చేసుకున్నాడు.

కూతురి ప్రేమకు అడ్డుతగలడంతోపాటు తనను కొట్టాడని సుఫారీ ఇచ్చి మరీ భార్య.. భర్తను హత్య చేయించిందని పోలీసులు విచారణలో తేల్చారు. మైసమ్మ అనే మహిళకు 3 మేకలను ఇచ్చి భర్త హత్యకు ప్లాన్ చేసింది భాగ్యలక్ష్మి. మద్యం తాగించి మేకల షెడ్డు దగ్గర ఆంజనేయులును పడుకోబెట్టగా.. పథకం ప్రకారం కంట్లో కారం చల్లి గొంతుకోసి హత్య చేసింది కాళ్ల మైసమ్మ. ఆమెకు మరో ఇద్దరు సహకరించారు. గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి నిందితులు జారుకున్నారు.

ఇందుకు సంబంధించి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమదైన స్టైల్‌లో విచారించి.. నిజాలు రాబట్టిన పోలీసులు.. భాగ్యలక్ష్మితో పాటు నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు.

Related posts

Share this