June 29, 2024
SGSTV NEWS
Crime

Telangana: అసలు వీడు అసలు మనిషేనా.. కేవలం మూడున్నర తులాల బంగారం కోసం..!

సమాజంలో మనషి అన్న వాడే మాయమవుతున్నాడు. బంధాలకు విలువలేదు. దైవం అంటే భక్తి లేదు. కన్న తల్లిదండ్రులపై ప్రేమ, గౌరవం అనేవి కనిపించడం లేదు. ఇవన్నీ లేకపోగా అమ్మా నాన్నలను వేధించడం, రోడ్డున వదలేయడం, కొట్టడం, చంపడం వంటి దారుణాలు కూడా చూస్తున్నాం. తాజాగా అలాంటి అమానుష ఘటనే సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. కేవలం మూడున్నర తులాల బంగారం కోసం కని పెంచి పోషించిన తల్లిదండ్రులను కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. నిందితుడి సోదరి.. తమ తల్లిదండ్రుల ఆచూకీ కోసం 25 రోజులుగాద అలుపెరగని పోరాడం చేయడంతో అసలు నిజం బయటపడింది..!

హత్నూర మండలానికి చెందిన సాదుల్లానగర్‌కు చెందిన సాకలి లక్ష్మణ్ జీవనాధారం కోసం దుండగల్‌లో ఒక ప్రైవేట్ జాబ్ చేయడానికి వెళ్లాడు. అక్కడ ఇతగాడికి సకల వ్యసనాలు అలవాటయ్యాడు. చేతికి దొరికిన దగ్గరల్లా అప్పులు తెచ్చాడు. చివరికి అవి పీకల మీదకి వచ్చాయి. దీంతో అతడి కన్ను కన్నతల్లి మెడలో ఉన్న బంగారపు గొలుసుపై పడింది. ఎలాగైనా తల్లి దగ్గరి నుంచి ఆ గోల్డ్ చైన్ తీసుకోవాలని నిర్ణయించుకున్న లక్ష్మణ్, పక్కాగా ప్లాన్ గీశాడు. ప్లాన్ ప్రకారం మే 22 రోజున తన అమ్మానాన్నలకు దుండిగల్ తీసుకెళ్లాడు. అందరూ కలిసి లిక్కర్ సేవించి, తిని పడుకున్నారు. అందరూ నిద్రలోకి జరుకున్న తర్వాత భార్యతో సహకారంతో తల్లిదండ్రులను గొంతు నులిమి హత్య చేశాడు.

ఆ తర్వాత కారులో నర్సాపూర్ ఫారెస్ట్ సమీపంలోని రాయరావు చెరువు మరుగు ప్రాంతంలో తల్లిదండ్రుల శవాలపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ విషయాన్ని దాచిన భార్యాభర్తలు తమకేం తెలియనట్లు గమ్మున ఉండిపోయారు. తల్లిదండ్రులకు కనిపించకపోవడంతో.. వారి కుమార్తె, తెలిసిన అన్ని చోట్లా గాలించింది. అయినా ఫలితం లేదు. అన్న మీద అనుమానం రావడంతో గ్రామంలోని ప్రజల సహకారంతో అతడ్ని నిలదీసింది. ఏం సమాధానం చెప్పకపోవడంతో గ్రామస్తులు అందరూ కలిసి లక్ష్మణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాక్షన్‌లోకి దిగిన పోలీసులు తమదైన స్టైల్‌లో ఎంక్వైరీ చేయగా, తల్లిదండ్రులను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో లక్ష్మణ్‌తో పాటు అతని భార్య అనితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణానికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related posts

Share via