పరువు పోయిందని ఒకరు.. అడిగినంత డబ్బులు ఇవ్వలేదని మరొకరు.. అసలు ఇష్టం లేని వివాహం చేశారని మరొకరు. కక్ష కట్టి క్షణాల్లో అన్నంత పని చేసేస్తున్నారు. ఓ కన్నకొడుకు తండ్రిని బలి తీసుకుంటే.. తొమ్మిది నెలల గర్బిని అని కూడా చూడకుండా కోడలును అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ మామ. ఇష్టం లేని పెళ్లి చేశారంటూ అత్తింటికే నిప్పు పెట్టి భార్య ప్రాణాలకు ముప్పు తెచ్చాడో భర్త. ఈ దారుణ ఘటనలకు ఉమ్మడి ఆదిలాబాద్ కేరాప్ అడ్రస్ గా మారింది.
కన్న కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని రగిలిపోయాడు ఓ తండ్రి. పరువు తీసేసిందని కోడలిపై కక్ష పెంచుకున్నాడు. కోడలును మట్టుపెడితేనే తన పగ చల్లారుతుందని సమయం కోసం ఎదురు చూశాడు. చివరికి కోడలు తొమ్మిది నెలల గర్బివతి అని కూడా చూడకుండా అత్యంత కిరాతకంగా కడుపులో ఉన్న బిడ్డను.. నిండు గర్బిని అయిన కోడలును హత్య చేశాడు కర్కోటక మామ. ఇంట్లో ఎవరు లేని సమయంలో నిండు గర్బిని అయిన కోడలుని పాశవికంగా గొడ్డలితో నరికి కత్తితో పొడిచి హత్య చేశాడు ఆ దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన కొమురంభీం ఆసిపాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం గెర్రె గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గెర్రె గ్రామానికి చెందిన తలాండి శ్రావణి (22), అదే గ్రామానికి చెందిన శివార్ల శేఖర్ లు ప్రేమించుకుని గత ఏడాది కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ ప్రేమ వివాహాన్ని శేఖర్ తండ్రి సత్తయ్య ఒప్పుకోలేదు. ఇంట్లో కి రావద్దంటూ కొడుకును కోడలిని గెంటేశాడు. చేసేది లేక భార్య శ్రావణి అలియాస్ రాణితో కలిసి శేఖర్ అత్తారింటి వద్దే ఉంటున్నాడు. ఇంతలోనే కోడలు శ్రావణి గర్బదాల్చిందనే సమాచారం అందుకున్న మామ సత్తయ్య.. మరింత పగ పెంచుకున్నాడు. శ్రావణి ని హతమారిస్తే తప్ప తన పగ చల్లారదని సమయం కోసం ఎదురు చూశాడు. గర్భిణి అయిన శ్రావణికి వైద్యులు వచ్చే నెల 17న ప్రసవ సమయం ఇచ్చారు.
ఒంటరిగా ఉన్న కోడలిపై గొడ్డలితో దాడి
శ్రావణి భర్త శేఖర్ తన అత్తామామలు చెన్నయ్య, అనూషలతో కలిసి వంట చెరుకు తీసుకురావడానికి గ్రామ సమీపం లోని అడవికి వెళ్లారు.. ఇదే సమయంలో శ్రావణి ఇంట్లో ఒంటరిగా ఉందన్న సమాచారం అందుకున్న సత్తయ్య.. ఇదే అదునుగా భావించిన గొడ్డలితో ఇంట్లోకి చొరబడ్డాడు. నిండు గర్భిణి అని కూడా చూడకుండా శ్రావణిపై దాడి చేశాడు. తప్పించుకునేందుకు ఆమె బయటకు పరుగులు తీసినా వదలలేదు. వెంబడించి మరీ దాడి చేసి గొడ్డలితో నరికిచంపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
గంటల వ్యవధిలోనే నిందితుడు అరెస్ట్
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తన కుమార్తె మృతికి శివార్ల సత్తయ్యతో పాటు ఆయన కుమారుడు కుమార్, కోడలు కవిత కారణమంటూ శ్రావణి తండ్రి చెన్నయ్య (లచ్చన్న) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. హత్య చేసిన తరువాత పరారైన సత్తయ్యను పోలీసులు గంటల వ్యవదిలో నే పట్టుకున్నట్టు సమాచారం.
మంచిర్యాల జిల్లాలో మరో దారుణం
ఈ ఘటన మరువక ముందే మంచిర్యాల జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకు అడిగినంత డబ్బులు ఇవ్వడం లేదని కన్నతండ్రినే కర్రతో కొట్టి చంపిన ఘటన జన్నారం మండలంలో చోటు చేసుకుంది. జన్నారం గ్రామ పంచాయతీలోని సేవదాస్ నగర్ కు చెందిన జాదవ్ శంకర్నాయక్ (60)కు ముగ్గురు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. నలుగురికి పెళ్లిళ్లు చేశాడు. శంకర్ నాయక్ భార్య రేణుకాబాయి రెండేళ్ల క్రితం క్యాన్సర్‌తో మృతి చెందింది. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న కుమారుడు నూర్సింగ్ నాయక్ మద్యానికి బానిసై నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి తరుచూ భార్యను వేదిస్తూ.. కొడుతుండడంతో ఆమె ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి నూర్ తండ్రితో కలిసి ఉంటున్నాడు.
అయితే ఇతను తరుచు తాగేందుకు డబ్బులు ఇవ్వాలని తండ్రిని వేధించేవాడు. పలుమార్లు గొడ్డలితో చంపుతానని వెంటపడగా శంకర్ నాయక్ తప్పించుకుని ప్రాణాలు కాపాడుకునే వాడు. ఈనెల 17న కూడా గొడ్డలితో చంపుతానని వెంటపడగా స్థానికులు 100కు డయల్ చేయడంతో పోలీసులు వచ్చి నూర్ సింగ్‌ను బెదిరించి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం 11 గంటల సమయం లో మద్యం సేవించి ఇంటికి వచ్చిన కొడుకు నూర్.. రొట్టెలు చేస్తున్న తండ్రిని కర్రతో తలపై బలంగా కొట్టాడు.
అడిగితే డబ్బులు ఇవ్వవా అంటూ విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన తండ్రి శంకర్ నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని చిన్న కూతురు జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు
Also read
- Telangana: అయ్యయ్యో.. ఇలా దొరికిపోతారని అనుకోలేదు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..
- పెళ్లి కోసం వచ్చిన వ్యక్తికి ఫుల్గా తాగించిన మైనర్లు.. తర్వాత ఏం చేశారో తెలిస్తే.. ఫ్యూజులెగరాల్సిందే
- Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..
- విజయవాడలోని ఈ ప్రాంతంలో భయం..భయం.. ఎందుకో తెలిస్తే అవాక్కే..
- అప్పులపాలైన వ్యక్తిని.. అయ్యో పాపమని చేరదీసిన వృద్ధురాలు.. ఏం చేశాడో తెలుసా?