June 26, 2024
SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: పెద్ద మొత్తంలో గంజాయి పట్టివేత.. పోలీసుల అదుపులో నిందితులు..

హైదరాబాద్‎లో గంజాయి‎పై పోలీసుల నిఘా కొనసాగుతోంది. తాజాగా నగరంలో రెండు అంతరాష్ట్ర గంజాయి ముఠాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 164 కేజీల గంజాయిని సీజ్ చేశారు. అక్రమరవాణా చేస్తున్న ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వివిధ మార్గాల్లో ఒడిస్సా నుండి హైదరాబాద్‎కు గంజాయిని తెప్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి రవాణాపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించారు. భవాని నగర్ పిఎస్ పరిధిలో 164 కేజీల గంజాయిని సీజ్ చేశామన్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గతంలో ఈ ముగ్గురిపై ఎన్డీపిఎస్ యాక్ట్ కింద కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ అక్రమ గంజాయి ముఠాలో ప్రధాన నిందితుడు షేక్‌పర్వేజ్ హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌కు చెందినవాడిగా పేర్కొన్నారు. రావులపాలెం, హైదరాబాద్‌లోని లంగర్ హౌస్‌లో పీఎస్‎లో గతంలో కేసులు నమోదైనట్లు చెప్పారు.

 

రావులపాలెం ఎన్‌డిపిఎస్ కేసులో షేక్‌పర్వేజ్ అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలులో ఉన్నట్లు తెలిపారు. అదే సమయంలో ఓడిశాలోని కలిమెల ప్రాంతానికి చెందిన గంజాయి రైతు దీపక్‌ని కలిశాడన్నారు. ఏప్రిల్‎లో లంగర్ హౌజ్ ఎన్‌డిపిఎస్ కేసులో జైలు నుండి విడుదలైన పర్వేజ్.. సులభంగా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేసినట్లు వివరించారు. అందుకోసం తన సహచరుల ద్వారా ఒడిశా నుండి హైదరాబాద్‌కు గంజాయి తెప్పించాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా దీపక్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో గంజాయిని హైదరాబాద్ నగరానికి తెప్పించాడు. బస్సులో వచ్చిన గంజాయిని షేక్ ఫర్వేజ్ హైదరాబాద్‎లో రిసీవ్ చేసుకునేవాడని చెప్పారు. విశ్వసనీయ సమాచారం మేరకు గంజాయి తరలిస్తుండగా భవాని నగర్ పోలీసులు రంగంలోకి దిగి షేక్ పర్వేజ్‎ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ముగ్గురు నిందితులను తదుపరి చర్యల కోసం భవాని నగర్ పోలీసులకు అప్పగించామన్నారు

Related posts

Share via