April 11, 2025
SGSTV NEWS
CrimeNationalTelangana

ఒక్క ప్యాకెట్ డెలివరి కోసం బెంగళూరు నుండి హైదరాబాద్ వరకు స్విగ్గి బాయ్ జర్నీ.. తీరా చూస్తే షాక్!

బెంగళూరుకు చెందిన మురళీధరన్ అనే యువకుడు స్విగ్గి డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నప్పటికీ పని రీత్యా హైదరాబాద్‌కు వచ్చాడు. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన మురళీధరన్ చుట్టూ పోలీసులు ఒకసారిగా రౌండప్ చేశారు. అతన్ని తనిఖీ చేయగా 11 గ్రాముల మత్తు పదార్థాలు లభించాయి. వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు మురళీధర్ ను విచారించారు. దీంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Also read :Instagram love: సోషల్ మీడియా పరిచయాలు తెస్తున్న తంటా.. ఇన్‌స్టా ప్రియుడికి పెళ్లైందని తెలిసి యువతి ఆత్మహత్య..

ఇటీవల బెంగళూరులో డ్రగ్స్ వాడకం భారీగా పెరిగింది. ఐటీ సెక్టర్ లో ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మత్తుకు బానిసలు అవుతున్నారు. బెంగళూరు నుండి హైదరాబాద్‌కు వస్తున్న డ్రగ్స్ ఎక్కువ శాతం ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే కొనుగోలు చేస్తున్నారు. ఈ తరుణంలో బెంగుళూరు నుండి వచ్చిన ఈ స్విగ్గి బాయ్ హైదరాబాద్‌లో ఎవరికి అమ్మాలి అనుకున్నాడు అనే విషయంపై శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు కూపీ లాగుతున్నారు..

Also read :Warangal: ఘోర విషాదం! భార్యను చంపి భర్త ఆత్మహత్య.. అనాథలైన ముగ్గురు చిన్నారులు

రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు అయిన తర్వాత డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే క్రమంలో ఎక్కడికక్కడ డ్రగ్స్ పై తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా గల్లీ గల్లీలో గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోయిన నేపథ్యంలో ఎవరిని ఉపేక్షించకుండా కట్టడి చేయాల్సిందిగా తెలంగాణ సీఎం పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో ఎక్కడ డ్రగ్స్ భూతం కనిపించినా సరే దాని వెనకాల ఎంత పెద్ద వారు ఉన్నా పోలీసులు వదలటం లేదు.

Also read :Hyderabad: నగరంలో డ్రగ్స్‎పై ప్రత్యేక దృష్టి.. ఏమాత్రం అనుమానం వచ్చినా..

ఇక తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువ మొత్తంలో డ్రగ్స్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్‌ పరిధిలో డ్రగ్స్ పై విస్తృత తనిఖీలు చేపట్టారు. గల్లీలో తిరుగుతున్న గంజాయి బ్యాచ్‌లపై పోలీసులు గట్టిగా నిఘా ఉంచారు. దీంతోపాటు నగర శివారు ప్రాంతాల్లో ఉన్న కళాశాలలపైన పోలీసుల నిఘా పెట్టారు. ఇప్పటికే ప్రతి కాలేజీలోనూ డ్రగ్స్ భూతాన్ని అరికట్టేందుకు యాంటీ డ్రగ్ కమిటీలను నియమించారు. డ్రగ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌లో తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు పిలుపునిస్తున్నారు

Also read :భర్తను చీరకు బిగించి హత్య చేసిన భార్య! ఎందుకంటే..

Related posts

Share via