విద్యుత్ షాక్ గురై యువకుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామంలో నివాస గృహాలకు ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో తండా వాసులు ఉలిక్కిపడ్డారు. తండాలోని పలు ఇళ్లలో గృహోపకరణాలు టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయి భారీ నష్టం వాటిల్లింది.
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం గూడెపుకుంట తండాలో హరిలాల్ అనే యువకుడు ఇంట్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించాడు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫోన్ ఛార్జింగ్ పెడుతున్న క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై హరిలాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద తీవ్రతకు తండా అంతటా విద్యుత్ సరఫరా జరిగి షాక్ రావడంతో తండావాసులు ఆందోళనకు గురయ్యారు. తండాలో ఇళ్లలో ఉన్న సామగ్రికి, గోడలకు, ఇతర వస్తువులకు విద్యుత్ సరఫరా జరిగి షాక్ రావడంతో తండావాసులు ఉలిక్కి పడ్డారు.
తండాలోని పలు ఇళ్లలో గృహోపకరణాలు టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయి భారీ నష్టం వాటిల్లింది. రెండు నెలలుగా తండాలో విద్యుత్ సమస్యలు ఉన్నాయని, వోల్టేజ్ హెచ్చుతగ్గుల గురించి పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదనీ తండా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే హరిలాల్ ప్రాణం పోయిందని, నిరుపేద కుటుంబానికి తీరని నష్టం జరిగిందని తండావాసులు కన్నీరు మున్నీరయ్యారు.
బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలనీ తండా వాసులు, మృతుని బంధువులు హరిలాల్ మృతదేహంతో పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు కదిలేది లేదని భీష్మించుక కూర్చున్నారు. ఈ ఆందోళనతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది
Also Read
- మద్యం మత్తులో తండ్రిని నరికి చంపిన తనయుడు.
- నారాయణ జూనియర్ కాలేజీ విద్యార్థిని మృతి.
- డ్యామిట్ సీన్ రివర్స్.. లవర్‌పై పెట్రోల్ పోసి నప్పంటించే ప్రయత్నం.. కట్‌చేస్తే..
- Telangana: డబ్బులు కట్టి గోల్డ్ విడిపిద్దామని బ్యాంక్‌కు వచ్చాడు.. తీరా నగలు పరిశీలించగా
- సాయంత్రం వేళ స్నేహితులతో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఇంటర్ విద్యార్థిని.. ఇంతలోనే షాకింగ్ ఘటన..!





