July 3, 2024
SGSTV NEWS
CrimeTelangana

తొలుత ప్రమాదం అనుకున్నారు.. కానీ తల్లిదండ్రుల అనుమానమే నిజమైంది..

హైదరాబాద్ బోరబండ పరిధిలో టీనేజర్ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. అమ్మాయి విషయంలో మిత్రులే తన స్నేహితుడిని కడతేర్చినట్లు నిర్ధారించారు. డెడ్‌బాడీని రైల్వే ట్రాక్‌పై పడేసి.. యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. కూకట్ పల్లికి చెందిన డానీష్ అనే యువకుడు యూసఫ్‌గూడలోని ఓ కాలేజ్‌లో ఇంటర్ చదువుతున్నాడు. అయితే కాలేజ్‌లో ఓ రౌడీ షీటర్ తనయుడితో పాటు మరికొందరు అతనికి ఫ్రెండ్స్ అయ్యారు. తనకు రిలేటివ్ అయిన ఓ అమ్మాయితో డానీష్ క్లోజ్‌గా ఉండటాన్ని.. రౌడీషీటర్ తనయుడు జీర్ణించుకోలేకపోయాడు. ఇదే విషయంలో వారి మధ్య పలుమార్లు గొడవ జరిగింది.

Also read :చూడటానికి సంప్రదాయనీ.. పనులు మాత్రం సుద్దపూసనీ తలపిస్తాయి

దీంతో రౌడీషీటర్ తనయుడు.. డానీష్‌ను హత్య చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకు తన ఫ్రెండ్స్‌తో సాయం కోరాడు. జూన్ 22న రాత్రి సమయంలో.. డానిష్‌కు ఫోన్ చేసి.. బోరబండకు రప్పించాడు. అతను వచ్చాక.. అందరూ కలిసి గంజాయి తాగారు. ఆపై బీరు సీసాలతో డానీష్‌పై దాడి చేశారు. అప్పటికీ అతను చనిపోకపోవడంతో.. గొంతు పిసికి ఊపరిరాడకుండా చేసి చంపేశారు. ఆపై ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై పడేశారు. అయితే డానీష్ తల్లిదండ్రులు అహ్మద్, అన్వరీ బేగంకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్ సిగ్నల్ ఆధారంలో విచారణ చేయడంతో క్లూ దొరికింది. ఆపై నిందితులను అదుపులోకి తీసుకుని విచారించడంతో.. నేరాన్ని అంగీకరించారు. నిందితులు ఐదుగురు మైనర్స్ కావడంతో.. వారిని కోర్టులో హాజరుపరిచి.. జువైనల్ హోమ్‌కు తరలించారు.
Also read :బాపట్ల జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

తిరుమలలో ముదురుతున్న మఠాల వ్యవహారం.. పోరాటానికి పిలుపునిచ్చిన జనసేన..

Related posts

Share via