ఉయ్యూరు
*_తెలంగాణ రాష్ట్ర నాయకులు ఉయ్యూరులో రాజేంద్రప్రసాద్ గారిని మర్యాదపూర్వక కలవడం జరిగినది_ .*
*రాజకీయాల్లో కష్టపడి పని చేస్తే – ప్రతిఫలం పదవుల రూపంలో దానంతట అవే వస్తాయి – ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్.*


*ఈరోజు ఉయ్యూరులోని రాజేంద్రప్రసాద్ గారి కార్యాలయంకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారినీ (ఖమ్మం జిల్లా), తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ బోర్డ్ మెంబర్ మరియు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి గారిని (రంగారెడ్డి జిల్లా), చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన భీం భరత్ గారినీ (రంగారెడ్డి జిల్లా), తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ గౌరవ అధ్యక్షులు పుసులూరి నరేంద్ర గారినీ (ఖమ్మం జిల్లా) శాలువా, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన రాజేంద్రప్రసాద్ గారు.*
_తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ లో పనిచేసి రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా రాయల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర పొల్యూషన్ బోర్డ్ మెంబర్ గా నామినేటెడ్ చేయబడిన చింపుల సత్యనారాయణ రెడ్డి గారు ఇటీవల నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టి ప్రప్రదమంగ ఉయ్యూరు వచ్చిన సందర్భంగా వారిని సత్కరించడం జరిగినది._
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ….
రాజకీయాల్లో అయినా, వ్యాపారంలోనైనా చిత్తశుద్ధితో కష్టపడి పని చేస్తే ప్రతిఫలం తనంతట అదే వస్తుందని, దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా రాయల నాగేశ్వరరావు గారికి ఎన్నుకోవడం జరిగిందని, అలాగే యువత రాజకీయాల్లోకి వచ్చి సమాజానికి మంచి సేవ చేస్తూ భవిష్యత్ తరాలకు దిక్సూచిగా ఉండాలని రాజేంద్రప్రసాద్ గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర సగరసాధికార కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజులపాటి ఫణి, యూనిట్ ఇంచార్జ్ చలపతి శ్రీను, బూత్ ఇంచార్జ్ రామనోళ్ళ శ్రీకాంత్, నరసింహారావు, రామలింగేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్నారు.
Also read
- ‘నేను చచ్చిపోయినా బాగుండేది’.. అమీన్పూర్ ముగ్గురు పిల్లల తండ్రి ఆవేదన!
- హెల్త్ సూపర్వైజర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సుపారీ ఇచ్చి మరీ భార్య దారుణంగా!
- Lady Aghori-Sri Varshini: అఘోరీ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. వర్షిణిని రప్పా రప్పా ఈడ్చుకెళ్లిన ఫ్యామిలీ
- ప్రయాణిస్తున్న రైలు వాష్‌రూమ్‌లో వేధింపులు.. వీడియోలు రికార్డింగ్
- ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో