ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చినా.. ఎన్నిసార్లు కౌన్సిలింగ్ చేసినా మత్తు బ్యాచ్ మాత్రం తగ్గేదేలే అంటోంది. మీరు ఏదైనా చేసుకోండి.. మా పని మాదే అంటూ చెలరేగిపోతున్నారు. అయితే, మత్తు బ్యాచ్ ఎత్తుల్ని చిత్తుచేస్తూ డ్రగ్స్ ముఠాలకు చెక్ పెడుతున్నారు పోలీసులు. తాజాగా రైల్వే స్టేషన్‌లో గంజాయి గుట్టు రట్టు చేసింది ఓ స్నిపర్ డాగ్..
గంజాయి రవాణా విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.. నిఘా ముమ్మరం అవడంతో స్మగ్లర్లు కొత్త కొత్త దారులు ఎంచుకుంటున్నారు.. రైలు మార్గాల్లో తీసుకువచ్చిన గంజాయిని అదే రైల్వేస్టేషన్లో రహస్యప్రదేశాల్లో భద్రపరిచి ఖాకీల కళ్ళుగప్పి తరలిస్తున్నారు.. ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్ లో రహస్యప్రదేశంలో భద్రపరిచిన గంజాయి బ్యాగ్ ను స్నిపర్ డాగ్స్ కనిపెట్టాయి.. వాసన పసిగట్టి గంజాయి బ్యాక్ కనిపెట్టడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.
సాధారణ తనిఖీల్లో భాగంగా యాంటి డ్రగ్స్ టీమ్ పోలీసులు కాజీపేట రైల్వేస్టేషన్ ఆవరణలో తనికీలు చేపట్టారు.. ఫ్లాట్ ఫాం నెంబర్ 1 శివారులోకి వెళ్ళగానే స్నీఫర్ డాగ్ వాసన పసిగట్టి పరుగెత్తింది.. ఫ్లాట్ ఫాం శివారులో ఒక స్విచ్ బోర్డు వద్ద ఆగి గంజాయి గుర్తించింది..
స్నిఫర్ డాగ్ డైరెక్షన్ మేరకు అక్కడి యాంటి డ్రగ్స్ టీమ్ తనిఖీలు చెపట్టగా అందులో గంజాయి బ్యాగ్ లభ్యమైంది.. నిత్యం ప్రయాణికులు, రైల్వే సిబ్బంది తిరిగే ప్రాంతంలో పక్కా ప్లాన్ ప్రకారం ఎవరు భద్ర పరిచారో తెలియక అంతా షాక్ అయ్యారు. రహస్యంగా భద్ర పరిచిన గంజాయి బ్యాగ్ వాసన పసిగట్టి కనిపెట్టిన స్నీఫర్ డాగ్ ను సిబ్బంది అభినందించారు.. గంజాయి స్మగ్లర్లు ఎవరూ..? ఎవరు అక్కడ గుట్టు చప్పుడు కాకుండా గంజాయి భద్ర పరిచారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.
Also Read
- HYDలో భార్య గొంతు నులిమి, గాజుతో కోసి కిరాతకంగా చంపిన భర్త!
- TG Crime: అందమే ఆమెకు శాపంగా మారింది.. ఎల్బీనగర్లో జాస్మిన్ హత్య వెనుక హృదయవిదారక కథ
- Vastu Tips: ఇంట్లో వాస్తు దోషమా.. ఒక్కటే రెమెడీ.. వినాయక విగ్రహం.. ఎక్కడ ఎలా పెట్టాలంటే..
- Razampet: మేనకోడలి పెళ్లికి వచ్చి హోటల్లో విడిది ఉన్న మహిళ.. తెల్లారి రెడీ అవుతుండగా…
- తన గర్భం నుండి భూమి మీదకి తీస్కుకొచ్చి
లోకాన్ని పరిచయం చేస్తుంది అమ్మ..!