హైదరాబాద్‌లో క్రైమ్ రేటు పెరిగిపోతోంది. వరుస మర్డర్స్ ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా సిటీలో మరో హత్య కలకలం రేపింది. ఇజాయత్ అలీ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇవటీవలే దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. అతడ్ని శనివారం దారుణంగా హత్య చేశారు దుండగులు. కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు.. అలీ గొంతు కోసి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిలో ఇద్దరు యువకులతో పాటు ఒక యువతి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హత్య తర్వాత.. వాహనాన్ని అక్కడే వదిలి నిందితులు ఎస్కేప్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని.. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. వాహనంతో పాటు రెండు ఫోన్లు సైతం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.
Also read :మాయమాటలు చెబుతూ.. హతమార్చుతూ..
కాగా మలక్ పేట్ మెట్రో స్టేషన్ సమీపంలో శుక్రవారం అర్థరాత్రి రౌడీ షీటర్‌ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి దారుణంగా మర్డర్ చేశారు. అదే రీతిలో బేగంపేటలో గురువారం హత్య జరిగింది. నగరంలో వరుస హత్యలు, దాడులు కలకలం రేపుతున్నాయి. 48 గంటల వ్యవధిలో 3 హత్యలు జరగడం.. ఆందోళన కలిగిస్తోంది. నేరస్థులపై పోలీసుల నిఘా తగ్గిపోవడం.. అర్ధరాత్రి వేళ పోలీస్ పెట్రోల్ వ్యవస్థ తాత్సారంగా మారడంతోనే నేరాలు ఎక్కువయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు వరుస నేరాలతో అలర్ట్ అయిన హైదరాబాద్ పోలీసులు.. సౌత్ జోన్ పరిధిలో 8 స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. అలాగే తనిఖీలను ముమ్మరం చేశారు. ఇలాంటి హత్యలు ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో చోటు చేసుకోవడంతో అనేక కేసులు నమోదు అవుతున్నాయి. వీటిని చూసిన ప్రజలు బయటకు వెళ్లాలంటే ఏ క్షణంలో ఏమి జరుగుతుందో, ఎక్కడ ఎలాంటి దారుణాలు చవిచూడాల్సి వస్తుందో అన్న భయంతో బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నారు
Also read :ఆ డబ్బు కోసం తండ్రిని చంపిన కొడుకు కథ! కోర్టుకి నిజం తెలిసి!