July 1, 2024
SGSTV NEWS
CrimeTelangana

Shadnagar: షాద్‌నగర్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. ముక్కముక్కలైన మృతదేహాలు

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో భారీ పేలుడు సంభవించింది. ఒక ఫ్యాక్టరీలో గ్యాస్‌ ఫర్నేస్‌ పేలడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్యాక్టరీలో బాయిలర్‌ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. అయితే బాధితులు ఇతర రాష్ట్రాలకు చెందిన..

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో భారీ పేలుడు సంభవించింది. ఒక ఫ్యాక్టరీలో గ్యాస్‌ ఫర్నేస్‌ పేలడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్యాక్టరీలో బాయిలర్‌ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. అయితే బాధితులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు ఎలా జరిగిందన్నదానిపై పోలీసులు ఆయా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమైపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 150 మంది ఉన్నట్లు సమాచారం.

Also read :మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ భూతం.. 300 గుంజీలు తీసిన విద్యార్థి పరిస్థితి విషమం..

అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

ఈ పేలుడు ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు చేపట్టాలని ప్రమాద స్థలంలో ఉన్న కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాప‌క శాఖ‌, కార్మిక‌, ప‌రిశ్రమ‌లు, వైద్య బృందాలు ఘ‌ట‌నా స్థలిలోనే ఉండి స‌మ‌న్వయంతో స‌హాయ‌క చ‌ర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు

Also read :మరిదితో వివాహేతర సంబంధం!.. చివరకు ఏం జరిగిందంటే?

Related posts

Share via