మల్టీజోన్-2 లోని తొమ్మిది జిల్లాలలో అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేయడంలో విఫలమైన ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్‌ఐలను VR లో పెడుతూ మల్టీజోన్-2 ఐజీపీ వి. సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో పోలీస్ ప్రక్షాళన షురూ అయ్యింది. అక్రమ దందాకు వత్తాసు పలుకుతున్న పోలీసు అధికారులపై వేటు పడింది. మల్టీజోన్-2 లోని తొమ్మిది జిల్లాలలో అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేయడంలో విఫలమైన ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్‌ఐలను VR లో పెడుతూ మల్టీజోన్-2 ఐజీపీ వి. సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంలో ఇప్పటికే సదరు అధికారులను బదిలీ చేయడం జరిగింది.
ప్రస్తుతం వేటు పడినవాళ్ళలో సంగారెడ్డి రూరల్, తాండూర్ రూరల్, తాండూరు టౌన్ సీఐలతోపాటు వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్(S), పెన్ పహాడ్, వాడపల్లి, హాలియా, ఎస్‌ఐలను VR లో పెట్టారు. వీరిలో కొందరికి ఇసుక అక్రమ రవాణాలో ప్రత్యక్షంగా, పరోక్ష సహకారం ఉండటంతో వారిపై డిపార్ట్‌మెంట్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐజీ సత్యనారాయణ పేర్కొన్నారు. త్వరలో వీరిని లూప్ లైన్‌కు ట్రాన్స్‌ఫర చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర నిఘా అధికారుల నివేదికలు, ఇతర ఎంక్వయిరీల ఆధారంగా ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని వెల్లడించారు.
ప్రధానంగా ఇసుక అక్రమ రవాణా ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది. అదేవిధంగా వాగుల్లో, నిషేధిత నది ప్రాంతాలలో ఎక్కడబడితే అక్కడ విచక్షణ రహితంగా ఇసుకను తవ్వకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా పర్యావరణ సమతుల్యానికి భంగం వాటిల్లే అవకాశం ఉండటంతో ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీ ఈ విషయంలో సీరియస్‌గా ఉండడంతో ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని ఐజీ తెలిపారు. ఇప్పటి నుండి ఎక్కడ కూడా ఇసుక అక్రమ రవాణా జరిగితే సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
అలాగే, కొండమల్లేపల్లి హోంగార్డు, జడ్చర్ల హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ అక్రమ ఇసుక రవాణాలో వసూళ్లు పాల్పడటంతో DAR కు అటాచ్ చేయడం జరిగింది. ఇక తదుపరి చర్యలు PDS రైస్ అక్రమ రవాణా మీద ఉంటుందని ఐజీ హెచ్చరించారు. దీనిపై ఇప్పటికే రహస్య విచారణ జరుగుతోందన్నారు. PDS రైస్ అక్రమ రవాణాలో స్థానికులే కాకుండా, అంతర్రాష్ట్రంగా చేసే ప్రధాన నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలకు ఐజీ సత్యనారాయణ ఆదేశించారు. PDS రైస్ అక్రమ రవాణా, అక్రమ ఇసుక రవాణా, గాంబ్లింగ్, మట్కా పూర్తిగా బంద్ కావాల్సిందేన్నారు. గాంబ్లింగ్, మట్కా జరిగితే సంబంధిత పోలీసు అధికారులపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే వికారాబాద్‌లోని మర్పల్లిలో గెస్ట్ హౌస్ లో పేకాట నిర్వహిస్తున్న ప్రభాకర్ సేట్, రఫిక్‌లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఐజీ సత్యనారాయణ. రఫీ మీద Suspect Sheet ఓపెన్ చేయడం జరిగింది. పేద, మధ్య తరగతి వ్యక్తుల నుండి దోపిడి చేసే ఈ గాంబ్లింగ్ పట్ల ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని ఆయన స్పష్టం చేశారు. మల్టీజోన్-2 లో గాంబ్లింగ్ వాసనే రాకూడదు. జిల్లాల్లో ఎక్కడ కూడా గాంబ్లింగ్ జరగకుండా చూసే బాధ్యత అయా జిల్లాల SP లదే అని ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు.
వికారాబాద్ టౌన్ ఇన్స్‌పెక్టర్ సస్పెండ్..!
ఇదిలావుంటే, బాధ్యతాయుతంగా వ్యవహారించాల్సిన పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే సహించేదీలేదన్నారు ఐజీ సత్యనారాయణ. ఈ క్రమంలోనే వికారాబాద్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌పై వేటు వేశారు. సీఐ నాగరాజును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో అలసత్వం, దర్యాప్తులో అవకతవకలకు పాల్పడినందుకు జోగిపేట ప్రస్తుతం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎ.నాగరాజును సస్పెండ్ చేశారు..
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం