ఇది సినిమా షూటింగ్ కాదు.. నిజంగా జరిగిన ఓ గొడవ. చూడటానికి సినిమాలా అనిపిస్తున్నా అసలు విషయం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఇది ఒక పోస్ట్ బాక్స్ పెట్టే విషయంలో జరిగిన గొడవ. ఏంటి.. దీనికి కూడా ఇలా ఇంత గొడవ పడతారా అని మీరు అనుకోవచ్చు. కానీ నిజంగా జరిగింది. హైదరాబాద్ నగరం ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఒక ఇంటి ముందర పోస్ట్ బాక్స్ పెట్టే విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఆ చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. నగరాన్ని షేక్ చేసే విధంగా మారింది. ఈ గొడవలో రెండు గ్రూపులు ఒకరిపై మరొకరు తీవ్రంగా దాడులు చేసుకున్నారు. అది కూడా నగరం నిద్ర పోతున్న సమయంలో.. చుట్టుపక్కల అంతా ప్రశాంతంగా ఉన్న టైం చూసుకుని ఇరువర్గాలు నడిరోడ్డుపై గొడవ పడ్డారు. అది చివరికి పోలీస్ స్టేషన్ వరకూ చేరి కేసు నమోదు అయ్యేలా చేసింది. ఇరు వర్గాలు తీవ్రంగా గొడవపడి కర్రలతో దాడులు చేసుకున్నారు. దీనిపై ఆసిఫ్ నగర్ వాసులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..