భాగ్యనగరంలో మరో బిగ్గెస్ట్ బ్రోతల్ దందా బయటపడింది. రెడ్‌లైట్ ఏరియాను మించిన డర్టీ పిక్చర్ వెలుగులోకి వచ్చింది. బిజినెస్ మొత్తం ఆన్‌లైన్‌లోనే. వాట్సాప్, టెలిగ్రామ్, వెబ్‌సైట్‌లో అమ్మాయిల ఫొటోలు చూసుకోవడం, నచ్చితే బుక్ చేసుకోవడం అంతే!. లొకాంటో, సొక్కా, టెలిగ్రామ్, వీడియో కాల్స్ ద్వారా ఈ సెక్స్ రాకెట్‌ను నడిపిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. హైటెక్ మాటున హైఫైగా సాగుతోన్న ఇంటర్నేషనల్ సెక్స్‌రాకెట్‌ను గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు.
ఆన్‌లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్‌లోని ఓ ఇంట్లో జీ+3 బిల్డింగ్‌ను అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు, 17 మంది విదేశీ యువతులకు విముక్తి కలిగించి, సేఫ్ హౌస్‌కు తరలించారు. నిర్వాహకుడు శివకుమార్‌తో పాటు ఇద్దరు విటులను అరెస్టు చేసినట్టు మాదాపూర్ ఏసీపీ తెలిపారు. ఓ వెబ్‌సైట్ ద్వారా ఈ ముఠా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, 25 హెచ్‌ఐవీ పరీక్ష కిట్లు, హుక్కా పాట్స్ స్వాధీనం చేసుకున్నారు.
అమ్మాయిలు అందరూ విదేశీయులే. కెన్యా, ఉగాండా, టాంజానియా దేశస్థులు. మొత్తం 17మంది. ఎప్పటికప్పుడు అమ్మాయిలను ఇంపోర్ట్ చేసుకోవడం.. వాళ్ల ఫొటోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి, విటులను ఎట్రాక్ట్ చేస్తున్నాడు బ్రోతల్ శివకుమార్. లొకాంటో, సొక్కా, టెలిగ్రామ్, వీడియో కాల్స్ ద్వారా ఈ సెక్స్‌రాకెట్‌ను నడిపిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. వాట్సాప్, వెబ్‌సైట్‌లో అమ్మాయిల ఫొటోలు చూసుకోవడం, నచ్చితే బుక్ చేసుకోవడం అంతే!. పోలీసులకు అనుమానం రాకుండా ప్రోసెస్ మొత్తం ఆన్‌లైన్‌లోనే కానిచ్చేస్తున్నారు బ్రోకర్లు
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025