November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

అలాంటి మహిళలను టార్గెట్ చేసిన సైకో కిల్లర్.. కన్నేస్తే ఖేల్ ఖతం..

పాలమూరు జిల్లాలో సీరియల్ కిల్లర్ కలకలం రేగింది. గత నెల జరిగిన ఓ మహిళ హత్య కేసు దర్యాప్తు చేస్తుండగా పోలీసులకు ఖంగుతినేలా డొంక దొరికింది. రెండేళ్లుగా సాగిస్తున్న వరుస హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. మద్యం, ఇతర అలవాట్లకు బానిసైన ఓ కూలీ.. అత్యాచారం, హత్యలే టార్గెట్‎గా నేరాలు చేస్తున్నాడు. మొత్తం ఆరు హత్య కేసుల్లో నిందితుడిగా తేలి కటకటాల పాలయ్యాడు. కూలీ అడ్డాలోని ఆడవాళ్లే ఆ దుర్మార్గుడి లక్ష్యం. డబ్బు ఆశ చూపి మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం.. అనంతరం హత్య చేయడం అతనికి పరిపాటిగా మారింది.

Also read :

పాలమూరు జిల్లాలో సీరియల్ కిల్లర్ కలకలం రేగింది. గత నెల జరిగిన ఓ మహిళ హత్య కేసు దర్యాప్తు చేస్తుండగా పోలీసులకు ఖంగుతినేలా డొంక దొరికింది. రెండేళ్లుగా సాగిస్తున్న వరుస హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. మద్యం, ఇతర అలవాట్లకు బానిసైన ఓ కూలీ.. అత్యాచారం, హత్యలే టార్గెట్‎గా నేరాలు చేస్తున్నాడు. మొత్తం ఆరు హత్య కేసుల్లో నిందితుడిగా తేలి కటకటాల పాలయ్యాడు. కూలీ అడ్డాలోని ఆడవాళ్లే ఆ దుర్మార్గుడి లక్ష్యం. డబ్బు ఆశ చూపి మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం.. అనంతరం హత్య చేయడం అతనికి పరిపాటిగా మారింది. ఇటీవలే హత్యకు గురైన ఓ మహిళా కేసు కూపీ లాగితే మిగిలిన ఐదు మర్డర్ల కహానీ బయటపడింది. కుటుంబాన్ని వదిలి, మద్యానికి బానిసై మహిళల మాన, ప్రాణాలు తీస్తున్నాడు కీచకుడు. గత నెల 23న మహబూబ్‎నగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న అమిస్తాపూర్‎లో దాసరి లక్ష్మీ అనే మహిళ దారుణ హత్యకు గురైంది.

అత్యాచారం చేసిన అనంతరం లక్ష్మీ గొంతుకోసి, మొఖంపై బండరాయితో మోదీ దారుణంగా చంపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న భూత్పూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలిలో దొరికిన ఆధారాలతో పాటుగా ఆ పరిసర ప్రాంతాల సీసీ కెమెరాల ఫుటేజ్‎ను పరిశీలించారు. ఎట్టకేలకు నిందితుడు బోయ కాశమయ్యగా గుర్తించిన పోలీసులు అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. జోగుళాంబ గద్వాల్ జిల్లా కేటిదొడ్డి మండలం చింతలకుంట గ్రామానికి చెందిన బోయకాశమయ్య అలియాస్ బోయ కాశీ రెండెళ్ల క్రితం ఇళ్లు వదిలి మహబూబ్ నగర్‎లో ఉంటున్నాడు. స్థానికంగా కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే మద్యం, ఇతర అలవాట్లకు బానిసై మహిళలపై నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. కూలీగా ఉన్న మహిళలే టార్గెట్‎గా హత్యలకు పాల్పడ్డాడు నిందితుడు. డబ్బు ఆశ చూపి ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుగురు మహిళల హత్య కేసుల్లో నిందితుడిగా తేలాడు.

తానొక్కడే ఐదుగురు మహిళల హత్యలకు పాల్పడ్డట్టూ నిందితుడు కాశమయ్య పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. భూత్పూరు పీఎస్ పరిధిలో గత నెలలో జరిగిన లక్ష్మీ హత్యతో పాటు గతేడాది జూలైలో జరిగిన మున్నురు మల్లేశ్ హత్యను తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. అలాగే 2022లో హన్వాడ పీఎస్ పరిధిలో సీతమ్మ, 2023లో వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ, నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి పీఎస్ పరిధిలో మరో మహిళను చంపినట్లు కాశమయ్య అంగీకరించాడు. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో మహబూబ్‎నగర్ రూరల్ పీఎస్ పరిధిలో మరో మహిళను సైతం హత్య చేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. డబ్బుల ఆశ చూపి అమాయక కూలీ మహిళల మాన, ప్రాణాలు బలిగొన్న సైకో ఊదంతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేపింది. నిందితుడికి కఠిన శిక్ష పడేలా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Also read :Andhra Pradesh: పింఛన్లు పంపిణీ చేస్తూ మధ్యలో ఇంటికి.. కాసేపటికే బాత్రూంలో శవమై కనిపించిన సచివాలయ ఉద్యోగిని!

Related posts

Share via