కత్తులు, తల్వార్‌లతో విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రీల్స్ చేసిన పోస్ట్ చేసిన వ్యక్తిని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్య నగర్ కు చెందిన తోటిచర్ల సాయి వర్ధన్ అనే యువకుడు గత కొద్ది రోజుల క్రితం తల్వార్, కత్తులతో విన్యాసాలు చేస్తూ రీల్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.
Also read :Vinukonda: నడిరోడ్డుపై 2 చేతులు తెగనరికి.. వామ్మో.. దారుణ హత్య..
రోడ్డుపై కత్తులను, తల్వార్లను వివిధ రకాల విన్యాసాలతో ప్రదర్శిస్తూ రీల్స్ చేశాడు. వివిధ సినిమా పాటలను జోడిస్తూ.. రోడ్డుపై వాటిని పట్టుకుని ” Mila tho thu marega ” అంటూ వివిధ ఫోటోలు, వీడియోలు తీసుకొని ఇంస్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో అప్లోడ్ చేశాడు. పోస్టు చేసిన ఫోటోలు, వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారుల దృష్టి వెళ్లాయి. దీంతో సాయి వర్ధన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సాయి వర్ధన్ చేసిన వీడియోలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉన్నాయని సాయి వర్ధన్ పై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. అతని వద్ద నుండి ఒక పెద్ద కత్తి, మోటార్ సైకిల్ ను స్వాధీన పరుచుకుని రిమాండ్ కు తరలించారు పోలీసులు.
Also read :Telangana: నమ్ముకున్న వాళ్లే ప్రాణం తీశారు.. ఓ వ్యాపారి 12 పేజీల మరణ వాంగ్మూలం!
ఇటీవల.. సోషల్ మీడియా లో ఇలాంటి విన్యాసాలు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, సోషల్ మీడియా లో ఇలాంటి విన్యాసాలు చేస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ప్రజలను భయపెట్టే రీల్స్ వీడియోల పేరుతో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారిపై నూతన చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు..
Also read :భార్యపై కోపంతో అత్తారింటికి వెళ్లి.. మరదళ్లపై బావ అఘాయిత్యం