SGSTV NEWS
CrimeTelangana

హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు.. ఇద్దరు అరెస్ట్!



తెలంగాణ పోలీస్ అప్రమత్తతతో ఉగ్రవాదుల పెద్ద కుట్రను భగ్నం చేసింది. హైదరాబాద్‌ మహానగరంలో పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా దాడులతో పాటు పేలుళ్లకు ఐసిస్ కుట్ర చేసినట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్‌ సంచలన ఆపరేషన్‌‌లో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.


తెలంగాణ పోలీస్ అప్రమత్తతతో ఉగ్రవాదుల పెద్ద కుట్రను భగ్నం చేసింది. హైదరాబాద్‌ మహానగరంలో పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా దాడులతో పాటు పేలుళ్లకు ఐసిస్ కుట్ర చేసినట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్‌ సంచలన ఆపరేషన్‌‌లో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు.


విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్‌కు చెందిన సమీర్‌ కలిసి హైదరాబాద్ నగరంలో భారీ పేలుళ్లకు ఫ్లాన్ చేశారు. ఇందు కోసం విజయనగరంలో సిరాజ్ పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్‌లకు ఐసిస్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్‌ అధికారులు గుర్తించారు. వీరి నుంచి భారీగా ఆయుధాలతోపాటు కీలక సమాచారాన్ని రాబట్టు తెలుస్తోంది. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు

Also read

Related posts

Share this